సినిమా మంత్రితో టాలీవుడ్ సినీ పెద్దలు భేటీ..

సినిమా మంత్రితో టాలీవుడ్ సినీ పెద్దలు భేటీ..

ప్రస్తుతం తెలంగాణలో కొత్త రాష్ట్ర ప్రభుత్వం కొలువుదీరి..మంత్రి వర్గంలో మార్పులు జరిగాయి. గతంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా(Cinematography Minister) ఆ బాధ్యతలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి (KomatireddyVenkatareddy) స్వీకరించారు. దీంతో సినిమా రంగానికి సంబంధించిన కొన్ని సమస్యలను పరిష్కరించేందుకు, టాలీవుడ్ నిర్మాతల సంఘం ఇవాళ మంత్రి కోమటిరెడ్డిని కలిశారు.

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దిల్ రాజు నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు, ప్రొడ్యూసర్ సురేష్ బాబు, ప్రసన్న, సి కళ్యాణ్, సుధాకర్ రెడ్డి తదితరులతో సినిమా మంత్రిని  కలిశారు. ఈ సమావేశంలో ప్రస్తుతం నెలకొన్న కొత్త సమస్యలను, చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్న మరికొన్ని సమస్యలను పరిష్కరించాలని వీరు మంత్రిని కోరినట్లు సమాచారం.

అందుకు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించి..ఈ విషయాలన్నిటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. అందుకు ఈ నెల (డిసెంబర్ 21వ) తేదీన ముఖ్యమంత్రిని 24 విభిన్న క్రాఫ్ట్‌లకు చెందిన తెలుగు ఇండస్ట్రీ ప్రముఖులు కలవనున్నారు. దీంతో కొత్త ప్రభుత్వంతో భేటీ కానున్నా..సినిమా పరిశ్రమ పెద్దలు..ఎటువంటి సమస్యలను తీర్చబోతున్నారనేది టాక్ అఫ్ ది ఇండస్ట్రీగా మారింది.