అవి నిజం కాదు.. దిల్ రాజు క్లారిటీ

అవి నిజం కాదు.. దిల్ రాజు క్లారిటీ

నిర్మాత దిల్ రాజు బాలీవుడ్‌‌‌‌‌‌‌‌పై ఫోకస్ పెట్టారని, అక్కడ ఏకంగా ఆరు సినిమాలను ప్లాన్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారని గత కొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ ప్రచారంపై దిల్ రాజు స్పందిస్తూ ఓ నోట్‌‌‌‌‌‌‌‌ విడుదల చేశారు. ‘‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుండి రాబోయే సినిమాల గురించి ఇటీవల రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. అవన్నీ పూర్తిగా నిరాధారమైనవని, వాటిలో నిజం లేదు. 

ఎప్పుడో వచ్చిన పాత ఊహాగానాలకు, ఇప్పటి విషయాలకు ముడిపెట్టి తప్పుగా ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ హీరోగా, అనీస్ బాజ్మీ దర్శకత్వంలో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాం. ప్రీ ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌ దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో అధికారికంగా వెల్లడిస్తాం. అప్పటివరకూ అసత్యాలను ప్రచారం చేయొద్దు’ అని ఈ నోట్‌‌‌‌‌‌‌‌లో దిల్ రాజు తెలియజేశారు.