నిహారిక నిర్మాతగా పదకొండు మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్‌ను పరిచయం చేస్తూ యదు వంశీ రూపొందించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఆగస్టు 9న విడుదలైన ఈ చిత్రం విమర్శకులతో పాటు సినీ సెలబ్రిటీల నుంచి అభినందనలు అందుకుని హిట్‌గా నిలిచింది. తాజాగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన 50 డేస్ సెలబ్రేషన్స్‌కి నిర్మాత దిల్ రాజు, నాగబాబు అతిథులుగా హాజరై టీమ్‌కు షీల్డ్‌లను అందజేశారు.
దిల్ రాజు మాట్లాడుతూ ‘ఇలాంటి సినిమాల సక్సెస్ చూసినప్పుడు ఇంకా చాలామంది నిర్మాతలు కొత్త తరహా సినిమాలు చేయటానికి ముందుకొస్తారు. టీమ్ అందరికీ కంగ్రాట్స్’ అని చెప్పారు. నాగబాబు మాట్లాడుతూ ‘ఈ సక్సెస్‌లో భాగమైన టీమ్ అందరికీ అభినందనలు. సినిమా చూస్తున్నంతసేపు మా చిన్ననాటి రోజులు గుర్తుకు వచ్చాయి. నేషనల్ అవార్డు సాధించటానికి అన్ని అర్హతలున్న సినిమా ఇది. తప్పకుండా టీమ్ అందుకోసం ప్రయత్నించాలని కోరుకుంటున్నా’ అన్నారు. ఈ సక్సెస్ పట్ల చాలా హ్యాపీగా ఉన్నామని టీమ్ చెప్పింది.