‘కలెక్షన్ల పోస్టర్లు’ ఏముందిలే.. నీకెంత కావాలంటే అంత వేద్దాం: నిర్మాత నాగవంశీ

‘కలెక్షన్ల పోస్టర్లు’ ఏముందిలే.. నీకెంత కావాలంటే అంత వేద్దాం: నిర్మాత నాగవంశీ

కింగ్‌డమ్ మూవీ రేపు (జులై31న) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఎమోషనల్ థ్రిల్లర్గా తెరకెక్కించారు. దాదాపు రూ.130 కోట్ల బడ్జెట్తో నిర్మాత నాగవంశీ నిర్మించారు. ఈ సందర్భంగా ఇవాళ నిర్వహించిన ప్రెస్ మీట్లో నాగవంశీ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. 

నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. ' ఈ మధ్య కాలంలో ఫస్ట్ డే ఓపెనింగ్ తెచ్చుకోవడం పెద్ద ఛాలెంజింగ్గా మారింది. ఇపుడు ఆ విషయంలో సక్సెస్ అయ్యాము. నైజాం ప్రీ బుకింగ్స్ చాలా బాగుంది. ఆంధ్ర వైబ్ ఇప్పుడే మొదలైంది' అని అన్నారు.

Also read:-కింగ్‌డమ్ కంటెంట్పై .. విజయ్ దేవరకొండ ఏం చెప్పారంటే?

ప్రీమియర్స్ గురించి మాట్లాడుతూ.. జులై 31న మార్నింగ్ 7కి షో స్టార్ట్ అవుతుంది. కనుకే, ప్రీమియర్స్ వేయలేదని తెలిపారు. ఈ సినిమా ముఖ్యంగా ఫ్యాన్ వార్ జోన్ కాదు.. ఇదొక గౌతమ్ కింగ్‌డమ్ ఫిల్మ్. ఇక సినిమా కలెక్షన్ల పోస్టర్లూ ఇవన్నీ ఏముందిలే? నీకెంత కావాలంటే అంత వేద్దాం' అని తనదైన శైలిలో నాగవంశీ చెప్పుకొచ్చారు.

ఇకపోతే, ఈ మధ్యకాలంలో మేకర్స్ తమ సినిమాల కలెక్షన్స్ ప్రకటించట్లేదు. గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే ప్రకటించిన వసూళ్ళలో భారీగా వ్యత్యాసం ఉందనే కామెంట్స్ వైరల్ అయ్యాయి. అదే సమయంలో ఎంత జెన్యూన్గా కలెక్షన్లు ప్రకటించినా, అవి ఫేక్ అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఇటీవలే వీరమల్లు వసూళ్ల విషయంలో డైరెక్టర్ జ్యోతి కృష్ణ‌ కూడా ఇదే తెలిపారు. ప్రస్తుతం కలెక్షన్లు ఎంతో చెప్పే వెబ్ సైట్లు చాలానే అందుబాటులో ఉన్నాయని తనదైన శైలిలో జ్యోతి కృష్ణ‌ చెప్పుకొచ్చారు.