సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా త్రివిక్రమ్(Trivikram) డైరెక్షన్ లో వస్తోన్న మూవీ గుంటూరు కారం(Gunturkaram). ఈ మూవీ నుంచి లీకులు సోషల్ మీడియాలో ఎలా హల్ చల్ చేస్తున్నాయో..ఫస్ట్ సింగిల్ అప్డేట్ విషయంలో కూడా అలానే వార్తలు వినిపిస్తున్నాయి.
లేటెస్ట్ గా ప్రొడ్యూసర్ నాగవంశీ(Nagavamsi) గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. ఈ నవంబర్ ఫస్ట్ వీక్ లోనే గుంటూరు కారం నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజవ్వటం పక్కా అంటూ ఆదికేశవ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చెప్పారు.
ALSO READ :- ODI World Cup 2023: మ్యాక్స్‌వెల్‌కు ప్రమాదం.. తలకు తీవ్ర గాయం
ఈ ఫస్ట్ సింగిల్ తో ఫ్యాన్స్ ను అంచనాలకు ఎక్కడ తగ్గేలా ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే..ప్రతిసారి అప్డేట్ లేట్ అవుతుందని వివరించారు. ఇక నుంచి గుంటూరు కారం నుంచి రాబోయే నాలుగు పాటల నగరా మోగుతుందని కన్ఫర్మ్ చేశారు. త్వరలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ను ప్రకటించే అవకాశం ఉంది.
Producer #NagaVamsi about #GunturKaaram first single release ! #MaheshBabu #GunturKaaramFirstSingle pic.twitter.com/atS6gG2wgR
— Rajesh Manne (@rajeshmanne1) November 1, 2023
హాసిని క్రియేషన్స్(Harika hasini creations) పై చినబాబు(Chinababu), సూర్యదేవర నాగవంశీ(Suryadevara nagavanshi) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో..బ్యూటీ శ్రీలీల(Sreeleela), మీనాక్షి చౌదరి(Meenakshi chaudary) హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో సంక్రాంతి కానుకగా 12 జనవరి 2024న థియేటర్లలో రిలీజ్ కానుంది.
