Ooru Peru Bhairavakona: సెన్సార్ కాకుండానే ఊరు పేరు భైర‌వ‌కోన‌ బుకింగ్స్..CBFCకి నిర్మాత నట్టికుమార్ ఫిర్యాదు

Ooru Peru Bhairavakona: సెన్సార్ కాకుండానే ఊరు పేరు భైర‌వ‌కోన‌ బుకింగ్స్..CBFCకి నిర్మాత నట్టికుమార్ ఫిర్యాదు

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ జంటగా క్రియేటివ్ డైరెక్టర్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’(Ooru Peru Bhairavakona). ప్రొడ్యూసర్ అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా ఈ సినిమాను నిర్మించారు. చాలా రోజుల నుంచి పోస్ట్ అవుతూ వస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 16న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు అడుగడుగున ఏదో అడ్డంకు వస్తూనే ఉంది. రిలీజ్ విషయంలో గానీ, షూటింగ్ విషయంలో గానీ ఏదో సమస్య వెంటాడుతూనే ఉంది.

లేటెస్ట్గా ఊరు పేరు భైరవకోన మూవీపై ప్రొడ్యూసర్ న‌ట్టికుమార్(Natti kumar) సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ స‌ర్టిఫికేష‌న్‌ (CBFC)కి ఫిర్యాదుచేశారు. అసలు సెన్సార్ కూడా పూర్తికాకుండానే ఈ సినిమా టికెట్ బుకింగ్స్ బుక్ మై షోలో అప్పుడే ఎలా ఓపెన్ చేశార‌ని త‌న ఫిర్యాదు లేఖ‌లో న‌ట్టికుమార్ పేర్కొన్న‌ట్లు సమాచారం. 

న‌ట్టికుమార్ ఇచ్చిన కంప్లీట్ లో..సెన్సార్ నిబంధ‌న‌ల ప్ర‌కారం సెన్సార్ స‌ర్టిఫికేట్ జారీ చేయ‌కుండా సినిమా రిలీజ్ డేట్‌ను అఫీషియ‌ల్‌గా  ప్ర‌చారం చేయ‌రాదని..అలాగే టికెట్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేయ‌కూడ‌దని తెలిపారు. అందుకు ఊరు పేరు భైర‌వ‌కోన మూవీ ఈ రెండు నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించిన‌ట్లుగా న‌ట్టికుమార్ త‌న ఫిర్యాదులేఖ‌లో వెల్లడించినట్లు తెలుస్తోంది. 

ఊరు పేరు భైర‌వ‌కోన‌ మూవీకి సంబంధించి నిర్మాతలు ఏ తేదీన సెన్సార్‌ చేయడానికి అప్లై చేసుకున్నారు? అప్పటికీ ఆర్డర్ లిస్ట్‌లో చాలా మూవీస్ సెన్సార్ స్క్రీనింగ్ కోసం పెండింగ్‌లో ఉండగా..మరి ఊరు పేరు భైర‌వ‌కోన‌కు ముందుగా ఎందుకు సెన్సార్ చేయాల్సి వచ్చింద‌నే విషయంపై సమగ్ర విచార‌ణ జ‌రిపించాల‌ని న‌ట్టికుమార్ తన ఫిర్యాదులేఖ‌లో వెల్లడించారు. ఇందుకు రీజినల్ సెన్సార్ బోర్డ్ బాధ్యులు అని..వారిపై చర్యలు తీసుకోవాలని ప్రొడ్యూసర్ న‌ట్టికుమార్ తెలిపారు.

అలాగే, సెన్సార్ నుంచి ఎటువంటి సర్టిఫికెట్ వచ్చిందో తెలియకుండా..టికెట్స్ బుక్ చేసుకోవడం వల్ల బుక్ మై షో టిక్కెట్లను ఎలా ఓపెన్ చేస్తారు? ఒకవేళ చిన్న పిల్ల‌లు చూడ‌కూడ‌ని సర్టిఫికేట్ జారీ చేస్తే, అలా ముందుగానే టికెట్స్ బుక్ చేసుకున్న వారికి ఎవ‌రు బాధ్యత వహిస్తారో నిర్మాత‌లు, సెన్సార్ స‌భ్యులు చెప్పాల‌ని ప్రొడ్యూసర్ న‌ట్టికుమా అన్నాడు. మరి ఈ విషయంపై ఊరు పేరు భైర‌వ‌కోన‌ మేకర్స్ నుంచి ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి.