పవన్ కోసం వెనక్కి తగ్గిన చిరంజీవి

పవన్  కోసం వెనక్కి  తగ్గిన చిరంజీవి

గ్యాంగ్ లీడర్ ..మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఈ మూవీ ఓ మైలురాయి. స్టోరీ, సాంగ్స్ పరంగా అప్పట్లో  గ్యాంగ్ లీడర్ సినిమా తెలుగు చిత్రసీమను ఓ ఊపు ఊపేసిందని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఈ చిత్రం ట్రెండ్ సెట్ చేసిందనాలి. అయితే కొత్త సంవత్సరంలో గ్యాంగ్ లీడర్ ని విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ మేరకు నిర్మాత నట్టికుమార్ తెలిపారు. సంక్రాంతి తర్వాత జనవరి నెలాఖరులో గ్యాంగ్ లీడర్ను తిరిగి రిలీజ్ చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. త్వరలో తేదీని ప్రకటిస్తామన్నారు. 

గ్యాంగ్ లీడర్ సినిమాను న్యూఇయర్ కానుకగా డిసెంబర్ 31న విడుదల చేయాలని అనుకున్నట్లు నట్టికుమార్ తెలిపరు. అయితే అదే రోజు పవన్ కళ్యాణ్ ఖుషీ సినిమాను రిలీజ్ చేస్తుండంతో.. మెగా హీరోల సినిమాలను ఒకేసారి పోటీగా విడుదల చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. అందుకే సంక్రాంతి తర్వాత గ్యాంగ్ లీడర్ విడుదలవుతుందన్నారు. 

50 థియేటర్లలో వంద రోజులు..

గ్యాంగ్ లీడర్ సినిమా మెగాస్టార్ చిరంజీవి కెరియర్‌లో మైల్ స్టోన్గా నిలిచింది. 1991 మే 5న విడుదలైన ఈ మూవీ అన్ని రికార్డులను బ్రేక్ చేసింది. 75కి పైగా ప్రింట్లతో రిలీజై.. ఏకంగా 30 కేంద్రాలలో నేరుగా.. మరో 15  20 కేంద్రాలలో నూన్‌షోలతో... అన్నీ కలిపి 50 సెంటర్లలో గ్యాంగ్‌ లీడర్‌ వంద రోజులు పూర్తి చేసుకుంది. హైదరాబాద్‌ సుదర్శన్‌ 70 ఎంఎంలో ఏకంగా 162 రోజులు ఆడటం విశేషం. విజయ బాపినీడు దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. చిరంజీవి స‌ర‌స‌న‌ విజయశాంతి హీరోయిన్గా చేసింది. చిరంజీవికి మాస్ ఇమేజ్ పటిష్టం కావడానికి ఈ చిత్రం విజయం చాలా దోహదం ప‌డింది. చిరంజీవి కెరీర్‌లోనే బెస్ట్ మాస్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం విడుదల త‌ర్వాతే చిరంజీవి నటన, స్టైల్, డ్యాన్స్  యూత్ను అట్రాక్ట్ చేశాయి. 

సూపర్ హిట్ సాంగ్స్..

గ్యాంగ్‌ లీడర్‌ మూవీ బప్పీలహరి అందించాడు. సింహాస‌నం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన బప్పీలహరి ఈసినిమాకు పాట‌లు అందించాడు. ఈ సినిమాలో ఆరు పాటలు సూప‌ర్ డూపర్ హిట్ అయ్యాయి. "పాప రీటా.... "పాలబుగ్గ...", "భద్రాచలం కొండ... ", "వానా.. వానా...",  వయసు వయసు...",  పనిసా ససా..." వంటి పాటలు.. వాటికి చిరంజీవి చేసిన డాన్స్ నేటికీ వీనులవిందు చేస్తున్నాయి. ఈ ఆరు పాటలను  బాలసుబ్రమణ్యం, చిత్ర చిత్ర ఆల‌పించారు. భువన చంద్ర, వేటూరి సుందర రామమూర్తి లిరిక్స్ అందించారు. మాగంటి మురళీమోహన్, రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య కీల‌క పాత్రలు పోషించారు.