
హైదరాబాద్, వెలుగు: వ్యూహం సిన్మాను సంక్రాంతి పండుగకు రిలీజ్ చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని సిన్మా నిర్మాత తరఫు లాయర్ బుధవారం హైకోర్టులో వాదించారు. సెన్సార్ బోర్డు పది మందితో రివ్యూ కమిటీ వేసి నిర్ణయం తీసుకున్న తర్వాతే రిలీజ్‌కు వీలుగా సర్టిఫికెట్ ఇచ్చిందని తెలిపారు. ఇప్పుడు విడుదల చేయలేకపోతే స్టూడెంట్స్ పరీక్షల బిజీలో పడిపోతారని, తమకు నష్టం జరుగుతుందన్నారు.