VirginBoys: ఆడియెన్స్‌కు ‘వర్జిన్ బాయ్స్’ నిర్మాత ఆఫ‌ర్స్‌.. టికెట్ కొంటే ఐఫోన్, థియేట‌ర్ల‌లో డ‌బ్బుల వ‌ర్షం

VirginBoys: ఆడియెన్స్‌కు ‘వర్జిన్ బాయ్స్’ నిర్మాత ఆఫ‌ర్స్‌.. టికెట్ కొంటే ఐఫోన్, థియేట‌ర్ల‌లో డ‌బ్బుల వ‌ర్షం

గీతానంద్, మిత్రా శర్మ జంటగా నటించిన  రొమాంటిక్ కామెడీ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్ ‘వర్జిన్ బాయ్స్’.దయానంద్ దర్శకత్వంలో రాజా దరపునేని నిర్మించారు.  జులై 11న సినిమా రిలీజ్. శనివారం ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌లో హీరో గీతానంద్ మాట్లాడుతూ ‘ఈ సినిమా ప్రేక్షకులని మరో కొత్త  ప్రపంచంలోకి  తీసుకెళ్తుంది.

ఈ తరం యూత్‌‌‌‌ బయోపిక్‌‌‌‌లా ఉంటుంది. నిజమైన సంతోషం మందు, మత్తు పదార్థాలలో ఉండదు. మనం ఏదైనా సాధించినప్పుడు వస్తుంది అని ఇందులో చూపించబోతున్నాం.

అలాగే ఈ సినిమా టికెట్ కొన్న 11 మందికి ఐ ఫోన్లను గిఫ్ట్‌‌‌‌గా ఇస్తాం’అని చెప్పాడు. మనీ రైన్ ఇన్ థియేటర్స్ అనే కాన్సెప్ట్తో కొన్ని థియేటర్లలో ఆడియెన్స్‌పై డబ్బు వర్షం కురిపిస్తామ‌ని, సినిమా చూస్తున్న ప్రేక్షకులు ఎవ‌రైనా ఆ డ‌బ్బును సొంతం చేసుకోవ‌చ్చున‌ని ప్ర‌క‌టించారు.

ఈ మూవీ తనకు వెరీ స్పెషల్ అని హీరోయిన్ మిత్ర శర్మ చెప్పింది. కాలేజీ రోజుల్లో జరిగిన  కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందించామని దర్శకుడు దయానంద్ అన్నాడు. ఎన్నో సర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్‌‌‌‌లతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుందని నిర్మాత రాజా దరపునేని అన్నారు. నటులు శ్రీహన్, రోనిత్ తదితరులు పాల్గొన్నారు.