రాజధాని రౌడీ విజయం

రాజధాని రౌడీ విజయం

కన్నడ స్టార్ యశ్ హీరోగా నటించిన చిత్రం ‘రాజధాని రౌడీ’.  ఇటీవల తెలుగులో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్‌‌ టాక్‌‌తో ప్రదర్శింపబడుతోంది.  ఈ సందర్భంగా సక్సెస్ మీట్ నిర్వహించారు.  నిర్మాత సంతోష్ కుమార్ మాట్లాడుతూ ‘విడుదలైన అన్ని థియేటర్స్‌‌ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. నైజాంలో 94 థియేటర్స్‌‌లో విడుదల చేశాం.  హైదరాబాద్ తో పాటు బీ, సీ సెంటర్స్‌‌లో  కలెక్షన్స్ బాగున్నాయి. ప్రేక్షకుల ఆదరణ మరింత దక్కుతుందని ఆశిస్తున్నాం’ అన్నారు. నిర్మాతలు టి. ప్రసన్నకుమార్,  తుమ్మలపల్లి రామసత్యనారాయణ,  నైజాం డిస్ట్రిబ్యూటర్ సంజీవి కూడా మాట్లాడారు.