పదేళ్లుగా రాష్ట్రంలో నియంతృత్వ పాలన: ప్రొ.హరగోపాల్

పదేళ్లుగా  రాష్ట్రంలో నియంతృత్వ పాలన: ప్రొ.హరగోపాల్

రాష్ట్రంలో గత పదేళ్లలో నియంతృత్వ పాలన సాగిందన్నారు పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్. ప్రజాస్వామ్య, పౌర హక్కులను అణిచివేసే విధంగా దాడులు జరిగాయన్నారు. ఉపా చట్టం రాష్ట్రంలో ఉపయోగించినట్లుగా ఎక్కడ జరగలేదన్నారు. ఈ చట్టం కింద 200 మందిపై కేసులు నమోదు చేశారని తెలిపారు.

 పదేళ్లలో విద్యారంగం పూర్తిగా విధ్వంసమైందని.. ఇన్నేళ్ల తర్వాత స్వేచ్చగా సభలు పెట్టుకునే అవకాశం రావడం గొప్ప విషయమన్నారు. పేద మద్య తరగతి విద్యార్థులకు చదువును దూరం చేసేలా వర్శిటీలను గత సర్కార్ దెబ్బతీసిందన్నారు  ప్రొఫెసర్ వెంకట నారాయణ. ప్రజాస్వామ్య వాదులు సెక్రటరియట్ లో పదేళ్ల తర్వాత అడుగు పెట్టామన్నారు పీపుల్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుడు రవిచందర్.