హైదరాబాద్, వెలుగు: మునుగోడులో టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు విచ్చలవిడిగా డబ్బులు, మద్యం పంచుతున్నా ఎన్నికల అధికారులు పట్టించుకోవట్లేదని టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. బై ఎలక్షన్ నిర్వహణలో ఈసీ, రాష్ట్ర ఎన్నికల అధికారులు ఫెయిలయ్యారని మండిపడ్డారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని సీఈవో ఆఫీస్ఎదుట మౌన దీక్ష చేపట్టారు. అనంతరం సీఈవో వికాస్‌రాజ్‌కు మునుగోడులో జరుగుతున్న అక్రమాలు, ఉల్లంఘనలపై ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. అధికార పార్టీ నాయకులు నిబంధనలను గాలి కొదిలేసినా ఈసీ పట్టించుకోవడం లేదన్నారు. మంత్రులే రంగంలోకి దిగి మద్యం పంచుతున్నారని ఆరోపించారు. మంత్రుల ఎస్కార్టును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరిగేలా చూడాలని కోరారు. మంత్రులు అధికార హోదాను ఉపయోగించుకుని హామీలు ఇస్తున్నారని విమర్శించారు.
