ప్రొ. కోదండరాంకు ధర్మ సందేహం.. విలీనమా..? పొత్తా..?

ప్రొ.  కోదండరాంకు ధర్మ సందేహం.. విలీనమా..? పొత్తా..?

తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ప్రొఫెసర్ కోదండరాం..ఓ ధర్మ సందేహంలో పడ్డారు. ఎన్నికల సమయం కాబట్టి..ఏ పార్టీకైనా ఈ ధర్మ సందేహం రావాల్సిందే.  అప్పటి టార్గెట్ తెలంగాణ అయితే ఇప్పటి టార్గెట్ తెలంగాణను కాపాడుకోవడం అని అంటున్నారు కోదండరాం. అందుకు ఏం చేయాలో తేల్చుకోలేకపోతున్నారు. మరి కోదండరాం సమస్య ఏంటి అంటే..

తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ కోదండరాం కీ రోల్. ఆయన నేత్రుత్వంలోనే తెలంగాణ జేఏసీ ఉద్యమ కార్యారచరణ ముందుకెళ్లింది. ఐదేళ్ల కిందట తెలంగాణ జన సమితి ఏర్పాటు చేశారు. TJS పొత్తులు, విలీనంపై రాష్ట్ర రాజకీయాల్లో హాట్ హాట్ చర్చ జరుగుతోంది. కొందరు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలని, మరికొందరు ఆ పార్టీలో విలీనం కావాలని ఇప్పటికే కోదండరాం కు సూచించారట. ఒంటిరిగా పోటీ చేయడం, ఇతర పార్టీలతో పొత్తుపెట్టుకోవడం..రెండూ నష్టమని చెప్తున్నారట.


తెలంగాణ జన సమితి 2018 ఎన్నికల్లో..మహాకూటమిలో చేరి పోటీ చేసింది. ఏ నియోజవర్గంలోనూ ఆ పార్టీ అభ్యర్థులు ప్రభావం చూపలేదు. కోదండరాం 2018 ఎన్నికల్లో పోటీ చేయలేదు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరాం పోటీ చేసి ఓడిపోయారు. పొత్తులు, విలీనంపై త్వరలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఇంటర్నల్ మీటింగ్ లో కోడండరాంకు చెప్తున్నారట. అయితే కొంతమంది మాత్రం విలీన ప్రతిపాదనల్ని వ్యతిరేకిస్తున్నారట. ప్రస్తుత పరిస్థితుల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు.

కోదండరాం ముందుకు ప్రస్తుతం వచ్చిన ఓ ప్రపోజల్ ఇంట్రెస్టింగ్ గా మారింది. రాష్ట్రంలో కొత్త పార్టీ వస్తోందన్న ప్రచారం జరుగుతోంది. కొత్త పార్టీ పెడుతున్న లీడర్లు..కోదండరాంను సలహాలు, సూచనలు అడుగుతున్నారట. ఈ లీడర్లను ఈ మధ్య ప్రొఫెసర్ కలిశారు. ఆ చర్చల్లో భాగంగానే కొత్త పార్టీకి పెద్ద దిక్కుగా ఉండాలని రిక్వెస్ట్ చేశారట. ఉద్యమ అనుభవాలతో సలహాలు ఇవ్వాలని కోరుతున్నారంట.

కొత్త పార్టీ లీడర్ల ప్రపోజల్స్ పై కోదండరాం ఆలోచనలో పడ్డారంట. కొత్త పార్టీలో ఆయన భాగం అవుతారా..? ఆయనే పార్టీని నడిపిస్తారా..? త్వరలో తేలుతుందంటున్నారు కోదండరాం సన్నిహితులు.