
హైదరాబాద్ : క్లబ్ ఫైట్ అమెరికాలో మోస్ట్ పాపులర్ గేమ్ . టాలెంట్ ఉంటే చాలు గల్లీ బాక్సర్లను కోట్లకు అధిపతులను చేసే ఆట కూడా. మైక్ టైసన్, ఫ్లైయద్ మెవెదర్ లకు వరల్డ్ లోనే స్టార్ డమ్ తీసుకొచ్చింది కూడా క్లబ్ ఫైటే. ఒక్క ఫైట్ గెలిస్తే చాలు. ఓవర్ నైట్ స్టార్‌డమ్ తో పాటు భారీగా ప్రైజ్ మనీ వస్తుంది. ఇలాంటి ఫైట్‌కు ఇప్పడు సిటీ వేదిక కానుంది.
సిటీలో ఇప్పటికే ఐపీఎల్, ప్రో- కబడ్డీ లీగ్స్ లాంటి మెగా లీగ్స్ లవర్స్ ని ఎంటర్ టైన్ చేస్తుండగా.. ఇదే జాబితాలో బాక్సింగ్ కూడా చేరనుంది. హైదరాబాద్ లో ఫస్ట్‌టైం క్లబ్ ఫైట్ పేరుతో ప్రొఫెషనల్ బాక్సింగ్ లీగ్ సందడి చేయనుంది. ఈనెల 28న సోమాజిగూడలోని పార్క్ హోటల్ వేదిక కానుంది. సాయంత్ర ఏడు గంటల నుంచి రాత్రి 11గంటల వరకు జరుగుతుంది. ఈ ఫైట్ 16 మంది ఇంటర్నేషనల్ బాక్సర్ స్ ఏసియన్ మెడలిస్ట్ వికాస్ సింగ్ , అరుణ్, దుష్యంత్, హర్మిత్ సింగ్ , పవన్ గోయట్, కుల్విందర్ సింగ్ , సునిల్ సివాచ్, హని చౌహాన్, ఆకాష్, మేరికోమ్ అకాడమికి చెందిన శాంతి కుమార్ లతో పాటు హైదరాబాద్ ప్లేయర్స్ లలిత్, విజయ్, జాహెద్ పాల్గొంటున్నారు. ఇక విమెన్ కేటగిరిలో శివాని దహియా, సరోజ్ బుగల్లా పోటీ పడతారు. ఫైట్ లో ఒక్కో రౌండ్ 3 నిమిషాల చొప్పున మొత్తం 5 రౌండ్ లు నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజర్లు తెలిపారు. మొత్తం 15 నిమిషాలు జరగనుంది. విజేతలకు ట్రోఫీలు, క్యా ష్ అవార్డ్స్ అందజేస్తారు.