‘మా’ అధ్యక్షుడు విష్ణు కూడా స్థానికేతరుడే

‘మా’ అధ్యక్షుడు విష్ణు కూడా స్థానికేతరుడే
  • ప్రొఫెసర్ వినోద్ కుమార్ డిమాండ్

ఓయూ, వెలుగు: ఏపీ విభజన చట్టం ప్రకారం సినిమా ఇండస్ట్రీని విభజించాలని తెలంగాణ టీవీ, ఫిల్మ్ డెవలప్​మెంట్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్​ గాలి వినోద్​కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం ఓయూలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విభజన చట్టం ప్రకారం మన రాష్ట్రానికి రావాల్సిన వాటా దక్కట్లేదన్నారు. మూవీ ఆర్టిస్ట్స్​ అసోసియేషన్(మా)​ ఎన్నికలప్పుడు అధ్యక్షుడిగా పోటీ చేసిన ప్రకాశ్​ రాజ్​ స్థానికేతరుడు అయినందునే ఓడిపోయారని, గెలిచిన మంచు విష్ణు కూడా ఏపీ రాష్ట్రానికి చెందినవారే కాబట్టి స్థానికేతరుడే అని అన్నారు. మా అసోసియేషన్​ను రద్దు చేసి ‘మా’ ఆస్తుల్లోంచి 48% తెలంగాణ కళాకారులకు కేటాయించాలని డిమాండ్ చేశారు.