హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటకు మంచి స్పందన వస్తోంది. ఇప్పటివరకూ ఒకటో తరగతిలో కొత్తగా 24,082 మంది విద్యార్థులు అడ్మిషన్ తీసుకున్నారు. ఒక్క గురువారమే 10,577 మంది చేరారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని 12,05,065 విద్యార్థులకు యూనిఫామ్ అందించినట్టు విద్యాశాఖ ప్రకటించింది.
అలాగే..17,14,012 మంది స్టూడెంట్లకు పాఠ్య పుస్తకాలను, 12,52,041 మంది విద్యార్థులకు నోట్ పుస్తకాలను, 2,33,613 విద్యార్థులకు వర్క్ బుక్స్ అందించినట్టు వివరించింది. బడిబాట కార్యక్రమంలో భాగంగా స్కూళ్లల్లో ఫౌండేషనల్ లిటరసీ అండ్ నుమెరసీ, లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ (ఎల్ఈపీ)లో నిర్వహించారు. కాగా, బడిబాట కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లాలో మంత్రి సీతక్క పాల్గొనగా, పలు జిల్లాల్లో ఎమ్మెల్యేలు, కలెక్టర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు.