రెవెన్యూ గ్రామంగా ప్రొఫెసర్ జయశంకర్ ఊరు..

 రెవెన్యూ గ్రామంగా ప్రొఫెసర్ జయశంకర్ ఊరు..

తెలంగాణలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అమరవీరులకు ప్రాధాన్యతనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.  ప్రొఫెసర్ జయశంకర్ స్వస్థలమైన అక్కంపేట గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా  రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు డిసెంబర్ 7వ తేదీ గురువారం రాత్రి ప్రభుత్వం ముందస్తు నోటిఫికేషన్‌ విడుదల  చేసింది. ఇక, ఇంద్రవెల్లిలోని అమర వీరుల స్థూపం సమీపంలో స్మృతి వనం అభివృద్ధి కోసం ఒక  ఎకరం భూమిని కేటాయించారు.

ఈరోజు మద్యాహ్నం ఎల్బీ స్డేడియంలో ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. దీంతో తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పడింది. ప్రమాణస్వీకారం అనంతరం సాయంత్రం5.30గంటలకు రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గం సమావేశమై పలు శాఖలపై సుదీర్ఘంగా చర్చించింది. ఈ సందర్భంగా కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.