గ్రాడ్యుయేట్స్​ ఎమ్మెల్సీ క్యాండిడేట్​గా కోదండరాం

గ్రాడ్యుయేట్స్​ ఎమ్మెల్సీ క్యాండిడేట్​గా కోదండరాం

హైదరాబాద్, వెలుగువరంగల్​– ఖమ్మం – నల్లగొండ గ్రాడ్యుయేట్స్​ ఎమ్మెల్సీ స్థానానికి తెలంగాణ జన సమితి (టీజేఎస్​) క్యాండిడేట్​గా పార్టీ చీఫ్​ ప్రొఫెసర్ ​కోదండరాం పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ ఉపాధ్యక్షుడు పీఎల్​ విశ్వేశ్వర్​రావు  ప్రకటించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ సమాజం తరఫున చట్టసభల్లో ప్రశ్నించే గొంతుక కోసమే కోదండరాం పోటీ చేస్తున్నారని చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం సాగిందని, కానీ ఈ ఆకాంక్షలను నెరవేర్చడంలో టీఆర్ఎస్​ ప్రభుత్వం ఫెయిలైందని విమర్శించారు. రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది నిరుద్యోగులు టీఎస్​పీఎస్సీ లో ఎన్​రోల్ చేసుకుంటే 29 వేల ఉద్యోగాలు మాత్రమే ప్రభుత్వం భర్తీ చేసిందన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న లక్షన్నర ఉద్యోగాలను భర్తీ చేయని సర్కార్ కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని గ్రాడ్యుయేట్స్​కు పిలుపునిచ్చారు. హైదరాబాద్​ నాంపల్లిలోని పార్టీ స్టేట్​ ఆఫీసులో సోమవారం మీడియా సమావేశంలో పీఎల్​ విశ్వేశ్వర్​రావు మాట్లాడుతూ.. సమైక్యాంధ్ర పాలనలో చవిచూసిన నిర్బంధానికి మించి తెలంగాణలో చూస్తున్నామని, ఆందోళనకు దిగితే అర్ధరాత్రి అరెస్టులు, గృహ నిర్బంధం చేస్తున్నారని విశ్వేశ్వర్​రావు మండిపడ్డారు. మచ్చ లేని నేతగా పేరున్న కోదండరాంకు మద్దతుగా నిలిచి ప్రజలు సరికొత్త రాజకీయాలకు శ్రీకారం చుట్టాలని ఆయన కోరారు. కోదండరాం అభ్యర్థిత్వానికి ఇప్పటికే టీఆర్​ఎస్​యేతర పార్టీల మద్దతు కోరామని, అన్ని పార్టీల నేతలు సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఈ సందర్భంగా టీజేఎస్​ వరంగల్​– ఖమ్మం– నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నిక పోస్టర్​, పాంప్లెంట్​ను  ఆవిష్కరించారు.

జీహెచ్​ఎంసీ ఎన్నికలకు సిద్ధంకండి: కోదండరాం

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీజేఎస్​ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పార్టీ చీఫ్​ ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు.