కాళేశ్వరం కామధేనువు కాదు.. తెలంగాణ పాలిట శాపం: ప్రొఫెసర్ కోదండరామ్

కాళేశ్వరం కామధేనువు కాదు.. తెలంగాణ పాలిట శాపం: ప్రొఫెసర్ కోదండరామ్

మొదటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలున్నాయని.. అధికారులు, నిపుణులు చెప్పినా వినకుండా బీఆర్ఎస్ సర్కార్ కాళేశ్వరం కట్టిందని మండిపడ్డారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్. కాళేశ్వరం కామధేనువు ఎట్లయితదో బీఆర్ఎస్ నతేలు చెప్పాలన్నారు. కాళేశ్వరం కామధేనువు కాదు.. తెలంగాణ పాలిట ఒక శాపంగా, భారంగా మారిందని ఫైర్ అయ్యారు.

మార్చి 1వ తేదీ శుక్రవారం బీఆర్ఎస్ నేతలు..కుంగిన మేడిగడ్డను సందర్శించేందుకు బస్సులో బయల్దేరి వెళ్లడంపై కోదండరామ్ స్పందించారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ రోజు బీఆర్ఎస్ చేస్తుంది చూస్తుంటే.. దొంగే, దొంగ దొంగ అని అరిచినట్లు ఉందన్నారు. ఇది మూడు పిల్లర్లకు  సంబంధించింది కాదు.. ...స్లాబ్ ప్రభావం మిగితా పిల్లర్ల మీద ఉంటుందని అన్నారు. ఏదో కేవలం సాంకేతిక లోపం కాదు... ప్రణాళిక, నాణ్యత, డిజైన్,  నిర్వహణ లోపం ఉందన్నారు.

కాళేశ్వరంలో ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజ్.. కట్టిన మూడేళ్లకు పిల్లర్లు కుంగిపోయాయని...  ఏం చెప్పాలని బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డకు బయల్దేరారని ప్రశ్నించారు. మేడిగడ్డ ప్రాజెక్టు ఎందుకు కుంగిందో బీఆర్ఎస్ నేతలు చెప్పాలన్నారు.  కాళేశ్వరంపై బీఆర్ఎస్ నేతలు అన్ని అబద్దాలే మాట్లాడుతున్నారని విమర్శించారు.  వాళ్ల లెక్క ప్రకారం.. గత నాలుగు సంవత్సరాల్లో 97వేలకు నీళ్లు వచ్చాయి.. కేవలం 40వేల ఎకరాల ఆయకట్టు మాత్రమే అభివృద్ధి చెందిందని అన్నారు. ఇస్టానుసారంగా నోటికేదొస్తే అది మాట్లాడుతామంటే.. చాలా స్పష్టంగా ప్రజలు మీకు సమాధానం చెప్పి నోరు మూయించారన్నారు. భూకంపాలు వచ్చే ప్రాంతంలో మల్లన్న సాగర్ కట్టారు.. ఆ ప్రాజెక్టు కట్టినా నీళ్లు నింపే పరిస్థితి లేదని కోదండరామ్ అన్నారు.