రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తెలుగు మాట్లాడటం నేర్చుకుంటున్నారు. అందుకోసం ప్రత్యేకంగా ఒక ప్రొఫెసర్ ను నియమించుకున్నారు. గవర్నర్ తమిళిసైకి ప్రొఫెసర్ శ్యామల తెలుగు నేర్పిస్తున్నారు. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో ఆమె ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. శ్యామలతో v6 ముచ్చటించింది. తెలుగు నేర్చుకోవాలనే తపనతో ఆన్ లైన్ క్లాసెస్ కూడా అటెండ్ అయ్యి.. భాషపై పట్టు సాధిస్తున్నారని తెలిపారు. ప్రజలకు దగ్గరయ్యేందుకు.. వారి సమస్యలను తెలుసుకోవాలనే ఉద్దేశంతో తెలుగు నేర్చుకోవాలని గవర్నర్ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. ఉన్నతాధికారులు తన పేరును సూచించారన్నారు.
తెలుగు భాషపై తాను అధ్యయనం చేయడం జరిగిందని.. చాలా వేగంగా నేర్చుకున్నారని తెలిపారు. కరోనా సమయంలో తెలుగు నేర్పించడం జరిగిందన్నారు. ఆన్ లైన్ లో ఆమె చక్కగా నేర్చుకున్నారని, ఆఫీసు సమయంలో పిలవలేదన్నారు. సాయంత్రం వేళ ఆన్ లైన్ లో ఆమె నేర్చుకోవడం జరిగిందన్నారు. ఎంతో ఆసక్తితో నేర్చుకుంటున్నారని వివరించారు. భాషను ఉపయోగిస్తే.. వస్తుందన్ని.. ఆమెకు రాయడం నేర్పలేదన్నారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సులువుగా తెలుగులోనే సమాధానం ఇస్తున్నారన్నారు. గవర్నర్ కు తెలుగు నేర్పించడం చాలా సంతోషంగా ఉందన్నారు.
