ప్రాజెక్టు–K కు 7thసెన్స్ సినిమాకు లింక్.. మురుగదాస్ ముందే ఊహించాడా?

ప్రాజెక్టు–K కు 7thసెన్స్ సినిమాకు లింక్.. మురుగదాస్ ముందే ఊహించాడా?

–ప్రస్తుతం ప్రపంచ సినిమా ఇండియన్ సినిమావైపు చూస్తోంది. బాహుబలి(Bahubali) సినిమాతో మొదలైన తెలుగు సినిమా వైభవం.. త్రిపుల్ ఆర్(RRR) సినిమాతో నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. దీంతో తెలుగు నుండి వస్తున్న సినిమాలకు వరల్డ్ వైడ్ గా గుర్తింపు దక్కుతోంది. తాజాగా అదే రేంజ్ లో తెలుగు నుండి వస్తున్న మరో మూవీ ప్రాజెక్టు కే(Project K).

ప్రభాస్(Prabhas) హీరోగా నాగ్ అశ్విన్(Nag Ashwin) తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగా.. ప్రాజెక్టు కే టైటిల్ ను శాన్ డియాగో కామిక్-కాన్(San Deigo Comic-Con) ఫెస్టివల్ లో రివీల్ చేయనున్నారు. ఈ ఘనత దక్కించుకున్న మొదటి ఇండియన్ సినిమాగా ప్రాజెక్ట్ కే రికార్డ్ క్రియేట్ చేసింది.

ఇక తాజాగా ఈ సినిమా నుండి వినిపిస్తున్న న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. ఈ సినిమా తమిళ హీరో సూర్య(Suriya) హీరోగా వచ్చిన 7th సెన్స్(7th Scence) సినిమాను పోలీ ఉంటుందట. 7th సెన్స్ సినిమాలో.. DNA ద్వారా మన పూర్వీకుల శక్తి సామర్ధ్యాలను తిరిగి తీసుకురావచ్చు అనే గొప్ప పాయింట్ చెప్పారు దర్శకుడు మురుగదాస్(Murugadas). 

ఇక ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ ను మన పురాణాలకు కనెక్ట్ చేస్తూ.. ప్రాజెక్టు కే ను తెరకెక్కిస్తున్నాడట నాగ్ అశ్విన్. ఈ సినిమాలో కూడా మన పూర్వీకుల DNA ద్వారా వారిని ప్రజెంట్ జనరేషన్ లోకి రప్పించి.. వారి శక్తి సామర్థ్యాలతో ప్రపంచాన్ని రక్షిస్తారట. ఈ ప్రయోగానికి సైటిస్టులు పెట్టుకున్న పేరు ప్రాజెక్ట్ కే. అందుకే ఈ సినిమాను ప్రాజెక్ట్ కే పేరుతో ప్రమోట్ చేస్తున్నారు మేకర్స్. ఇంత గొప్ప కాన్సెప్ట్ ను మురుగదాస్ పదేళ్ల క్రితమే మన ముందుకు తీసుకొచ్చారు. కానీ ఆ సినిమాను పెద్దగా ఆదరించలేదు ఆడియన్స్. ఇప్పుడు అదే కాన్సెప్ట్ తో భారీ బడ్జెట్ తో ప్రాజెక్టు కే సినిమా వస్తోంది. మరి ఈ సినిమాకు ఆడియన్స్ ఎలాంటి రిజల్ట్ ఇస్తారో చూడాలి.–