
‘ప్రాజెక్ట్ కె’. ప్రభాస్‌కి జంటగా నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్యాన్ వరల్డ్ లెవెల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం నుంచి సోమవారం దీపికా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఇందులో దీపిక సరికొత్త లుక్‌లో ఆకట్టుకుంటూ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. మరోవైపు ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు. దిశా పటానీ మరో హీరోయిన్‌గా నటిస్తోంది. సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది.