గుడ్ న్యూస్.. మరో 3,574 మంది టీచర్లకు ప్రమోషన్లు

గుడ్ న్యూస్.. మరో 3,574 మంది టీచర్లకు ప్రమోషన్లు

హైదరాబాద్, వెలుగు: సర్కారు బడుల్లో పని చేస్తున్న మరో 3,574 మంది టీచర్లకు ప్రమోషన్లు లభించాయి. సెకండరీ గ్రేడ్ టీచర్లకు (ఎస్జీటీ) స్కూల్ అసిస్టెంట్లు, ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్లు, ఎల్ఎఫ్ఎల్​ హెచ్‌‌‌‌‌‌‌‌ఎంగా పదోన్నతి లభించింది. ఈ మేరకు జిల్లాల్లో సబ్జెక్టులు, స్కూళ్లవారీగా డీఈవోలు పోస్టింగులు అందించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల22న ఎస్జీటీలకు ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. 

హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చిన నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు 5 రోజుల్లోనే పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేశారు. ఈ మేరకు జిల్లాలవారీగా ప్రమోషన్ అండ్ పోస్టింగ్ ఆర్డర్లను రిలీజ్ చేశారు. మొత్తం 3,574 మంది ఎస్జీటీలు ప్రమోషన్లు పొందారు. వీరిలో 2,763 మంది స్కూల్ అసిస్టెంట్లుగా, 811 మంది ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్లు, ఎల్‌‌‌‌‌‌‌‌ఎఫ్​ఎల్​ హెచ్‌‌‌‌‌‌‌‌ఎంగా పదోన్నతి పొందారు.  

ప్రమోషన్ పొందిన టీచర్లు.. ఆర్డర్లు జారీ అయిన 15 రోజుల్లో కొత్త పోస్టుల్లో చేరాల్సి ఉంటుంది. విద్యార్థులకు సబ్జెక్టు టీచర్లు అందుబాటులో ఉండేలా, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేందుకు ఇక నుంచి రెగ్యులర్​గా బదిలీలు, ప్రమోషన్లను నిర్వహిస్తామని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు.

 కాగా, వివిధ ఆరోపణల నేపథ్యంలో వరంగల్​ జిల్లాలో ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి డీఈవో జ్ఞానేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బదిలీ చేయడంతో,  అక్కడ ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి కాలేదని అధికారులు చెప్పారు. ఒకటీ, రెండు రోజుల్లోనే అక్కడా పూర్తి చేస్తామని విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అయితే,  టీచర్ల ప్రమోషన్లు, బదిలీలపై ప్రతిరోజూ పదుల సంఖ్యలో కోర్టు మెట్లు ఎక్కుతుండటంతో ఈ ప్రక్రియ కొనసాగుతుందా? లేదా? అనే అనుమానాలు ఉండేవి.  

చివరికి ఎలాంటి సమస్యలు లేకుండా ప్రమోషన్ల ప్రక్రియ పూర్తికావడంతో స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మరోపక్క 880 మంది స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ హెడ్ మాస్టర్లుగా ఇటీవలే ప్రమోషన్లు లభించాయి. మల్టీ-జోన్–-1లో 490 మంది, మల్టీ-జోన్-–2లో 390 మంది ఉన్నారు. మొత్తంగా ఈ ప్రక్రియలో 4,454 మంది టీచర్లకు ప్రమోషన్లు లభించాయి.