డిపాజిటర్ల డబ్బు కాపాడటం బ్యాంకర్ల విధి : ఆర్​బీఐ గవర్నర్​ దాస్​

డిపాజిటర్ల డబ్బు కాపాడటం బ్యాంకర్ల విధి : ఆర్​బీఐ గవర్నర్​ దాస్​

ముంబై: కష్టార్జితాన్ని దాచుకునే డిపాజిటర్ల డబ్బును కాపాడం బ్యాంకర్లకు పవిత్రమైన విధి అని రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఆర్​బీఐ ) గవర్నర్​ శక్తికాంత దాస్​ చెప్పారు. దేవాలయంలోనో, గురుద్వారాలోనో, మసీదులోనో  ప్రార్ధన చేయడం కంటే ఈ విధి ముఖ్యమైనదని, గొప్పదని  పేర్కొన్నారు. చిన్న మొత్తాలను దాచుకునే మిడిల్​ క్లాస్​, రిటైరయిన వ్యక్తుల డిపాజిట్లపైనే మొత్తం బ్యాంకింగ్​ సిస్టమ్​ నడుస్తోందని చెప్పారు. కాబట్టి, డిపాజిటర్ల డబ్బును పరిరక్షించడమే బ్యాంకర్లకు ప్రధానమైన బాధ్యతని దాస్​ అన్నారు. ఆగస్టు 30 నాడు ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ ఒక ప్రసంగం చేశారు. ఆ ప్రసంగం వీడియోను యూట్యూబ్​లో ఆర్​బీఐ సోమవారం అప్​లోడ్​  చేసింది.

అర్బన్​ కో–ఆపరేటివ్​ బ్యాంకుల డైరెక్టర్లను ఉద్దేశించి ఆర్​బీఐ గవర్నర్​ ఆ రోజు మాట్లాడారు. డిపాజిటర్ల డబ్బు భద్రంగా ఉండేలా బ్యాంకులతో కలిసి పనిచేయాల్సిన బాధ్యత ఆర్​బీఐ పైన ఉంటుందని దాస్​ పేర్కొన్నారు. ఈ దిశలోనే  రెగ్యులేషన్స్​  తేవడంతో పాటు, సూపర్విజన్​ బాధ్యతను ఆర్​బీఐ నిర్వహిస్తుందని అన్నారు. దేశపు ఎకానమీ సక్రమంగా నడవాలంటే బ్యాంకింగ్​ సిస్టమ్​ నిలకడగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.