మేడ్చల్ మున్సిపల్ ఆఫీసు వద్ద బీఆర్ఎస్ కౌన్సిలర్ల ధర్నా

మేడ్చల్ మున్సిపల్ ఆఫీసు వద్ద బీఆర్ఎస్ కౌన్సిలర్ల ధర్నా

మేడ్చల్ మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్, కమీషనర్ వ్యవహారశైలి పై అధికార పార్టీ కౌన్సిలర్లు నిరసనకు దిగారు. నల్ల కండవాలు వేసుకొని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఆందోళన చేపట్టారు. కార్యాలయ ఆవరణలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం మున్సిపల్ ఆవరణలో బైఠాయించిన 16 మంది బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు చైర్ పర్సన్‭కు హఠావో, మేడ్చల్‭కు బచావో అంటూ నినాదాలు చేశారు. అవినీతి పాలన తమకు వద్దంటూ నిరసన తెలియజేశారు. 

అభివృద్ధి పనులకు తమ వార్డులు నోచుకోవడం లేదని బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చిన‌ రెవెన్యూను పక్క దోవ పట్టిస్తున్న మేడ్చల్ చైర్ పర్సన్, కమీషనర్ ను సస్పెండ్ చేయాలన్నారు. అన్ని జిల్లా అధికారులకు వినతిపత్రాలు ఇచ్చామని.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.