
జన్నారం, వెలుగు: కవ్వాల్ టైగర్ జోన్లో భారీ వాహనాల రాకపోకలపై విధించిన అంక్షలు ఎత్తివేయాలని జన్నారం మండల కేంద్రంలో సామాజిక కార్యకర్త భూమాచారి, బీజేపీ నేత బద్రీనాయక్ గత 20 రోజులుగా చేస్తున్న రిలే నిరహర దీక్షకు మద్దుతుగా సోమవారం బీఆర్ఎస్, బీజేపీ నాయకులు, వర్తక సంఘం, కుల సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడడంతో పోలీసులు చేరుకొని రాస్తారోకోను విరమింపజేశారు.
దీంతో ఫారెస్ట్ డివిజన్ ఆఫీస్కు ర్యాలీగా వెళ్లి ఎఫ్డీవో రామ్మోహన్ కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమం అనంతరం దీక్ష శిబిరం వద్ద వంటా వార్పు నిర్వహించారు. బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితీశ్ రాథోడ్, మండల అధ్యక్షుడు మధుసూదన్ రావు, పార్టీ నేత గోపాల్, బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి భరత్ కుమార్, విజయ్ ధర్మా, మండల జనరల్ సెక్రటరీ జనార్దన్, మున్నురు కాపు సంఘం మండల అధ్యక్షుడు లక్ష్మణ్, వర్తక సంఘం అధ్యక్షులు వామన్ తదితరులు పాల్గొన్నారు.