సింగరేణి ఏరియా ఆస్పత్రి మూసేస్తే ఊరుకోం

సింగరేణి ఏరియా ఆస్పత్రి మూసేస్తే ఊరుకోం

కోల్​బెల్ట్, వెలుగు: బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి ఏరియా ఆస్పత్రిని మూసివేందుకు యాజమాన్యం చేస్తున్న కుట్రలకు నిరసనగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో బొగ్గు గనులపై నిరసన చేపట్టారు. కాసిపేట1, 2, శాంతిఖని గనితో పాటు డిపార్ట్​మెంట్లపై నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నాకు దిగారు. యాజమాన్యం నిర్ణయాన్ని ఉపసహరించుకోవాలని డిమాండ్ ​చేశారు. 

ఆయా గనుల మేనేజర్లకు వినతిపత్రాలు అందజేశారు. బెల్లంపల్లితోపాటు పరిసర సింగరేణి ప్రాంతాల కార్మికులు, వారి కుటుంబాలకు వైద్య సేవలు అందిస్తున్న ఏరియా ఆస్పత్రిని మూసివేస్తే ఊరుకోబోమని లీడర్లు హెచ్చరించారు. ఏఐటీయూసీ కేంద్ర కమిటీ సెక్రటరీ ఎండీ అక్బర్​అలీ, మందమర్రి, బెల్లంపల్లి బ్రాంచీల సెక్రటరీలు సలెంద్ర సత్యనారాయణ, దాగం మల్లేశ్, సెక్రటరీ వెంకటస్వామి, తిరుపతి గౌడ్,  పిట్ ​సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.