బండి అరెస్టును ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్త నిరసనలు.. నాయకుల ముందస్తు అరెస్టు

బండి అరెస్టును ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్త నిరసనలు.. నాయకుల ముందస్తు అరెస్టు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టును ఖండిస్తూ బీజేపీ రాష్ట్ర, జాతీయ నేతలంతా పోలీస్ చర్యపై మండి పడుతున్నారు. బండిని అక్రమంగా అరెస్ట్ చేశారని బీజేపీ జాతీయ నాయకులంతా సీరియస్ అవుతున్నారు. అర్థరాత్రి కరీంనగర్ లో బండి సంజయ్ ని అరెస్ట్ చేసిన పోలీసులు.. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్త పరిస్థులు నెలకొన్నాయి. పోలీస్ స్టేషన్ కు భారీగా తరలి వచ్చిన బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. కార్యకర్తలను నిలువరించేందుకు స్టేషన్ చుట్టూ ముల్ల కంచె ఏర్పాటు చేశారు పోలీసులు. 

ఈ క్రమంలో తనను ఏ కేసులో అరెస్టు చేశారో చెప్పాలని బండి సంజయ్ పోలీసులను కోరారు. దానికి స్పందించిన పోలీసులు.. సంజయ్ ది ప్రివెంట్ అరెస్ట్ అని తెలిపారు. బండి సంజయ్ కి మద్దతుగా బీజేపీ కార్యకర్తలంతా నిరసనలు తెలియజేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాయకులను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. బండికి మద్దతుగా.. బీజేపీ సీనియర్ లీడర్లు బూర నర్సయ్య గౌడ్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ కు వెళ్ళారు. మరి కాసేపట్లో పోలీస్ స్టేషన్ కు రఘునందన్ రావు చేరుకోనున్నారు.  

బండి సంజయ్ అరెస్టు్ను ఖండిస్తూ జాతీయ నేతలు బీఆర్ఎస్ పార్టీపై మండి పడుతున్నారు. పాలన చేతకాకే బండి సంజయ్ ను అరెస్ట్ చేశారని బీఎల్ సంతోష్ అన్నారు. బండి సంజయ్ అరెస్ట్ ను తీవ్రగా ఖండిస్తున్నామని, ఇది ముమ్మాటికీ రాష్ట్ర సర్కారు కుట్రే అని వివేక్ వెంకటస్వామి మండి పడ్డారు. బండి సంజయ్ ని వెంటనే రిలీజ్ చేయాలని, లేదంటే పరినామాలు చాలా తీవ్రంగా ఉంటాయని కిషన్ రెడ్డి హెచ్చరించారు.