సీఎం జగన్ పై దాడి కేసు: విజయవాడ కమిషనర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత...

సీఎం జగన్ పై దాడి కేసు: విజయవాడ కమిషనర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత...

సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. ఈ కేసులో శరవేగంగా దర్యాప్తు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని కోర్ట్ ఆదేశాలతో రిమాండ్ కి తరలించారు.ఈ కేసులో A2 అయిన దుర్గారావుకు స్థానిక టీడీపీ నాయకుడు బోండా ఉమ ఆఫీసులో పని చేసే ఉద్యోగి కావటంతో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరింది. 

ఈ నేపథ్యంలో విజయవాడ సీపీ కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దాడి కేసులో వేముల దుర్గారావును చూపించాలంటూ.. విజయవాడ పాయకాపురం వడ్డెర కాలనీవాసులు కమిషనర్ కార్యాలయం వద్ద శనివారం ఆందోళన చేపట్టారు. దుర్గారావును గత ఆరు రోజులుగా చూపించడం లేదంటూ సీపీ కార్యాలయం గేట్ ముందు కాలనీవాసులు బైఠాయించారు. సమాచారం అందుకున్న సూర్యారావుపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చర్చలు జరుపుతున్నారు.

Also Read: చంద్రబాబు ఆదేశంతోనే బోండా టీమ్ దాడి చేసింది.. వెల్లంపల్లి