
సోమవారం మంత్రులు, MLAల ఇంటి ముందు నిరసనలకు పిలుపునిచ్చారు RTC జేఏసీ నేతలు. కార్మికులపై దాడి జరిగినా… ప్రజా ప్రతినిధులు ఎవరూ స్పందించకపోవడం దారుణమన్నారు. ఆదివారం హైద్రాబాద్ విద్యానగర్లోని ఆర్టీసీ యూనియన్ ఆఫీస్ లో రాజకీయ పక్షాలతో భేటీ అయ్యారు జేఏసీ నేతలు.
వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజాసంఘాలతో కలిసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించింది జేఏసీ. ఎల్లుండి కన్వీనర్లంతా కలిసి నిరవధిక నిరాహార దీక్షకు దిగుతున్నట్లు చెప్పారు జేఏసీ నేతలు. ప్రభుత్వం ఇప్పటికైనా చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.