- కేటీఆర్ కు గజ్జెల కాంతం సవాల్
హైదరాబాద్, వెలుగు: తనకు 2006లోనే 3 హోటల్స్ ఉన్నాయని చెప్తున్న కేటీఆర్.. దమ్ముంటే వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను చూపించాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం సవాల్ చేశారు. శుక్రవారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఆంధ్రకు చెందిన పారిశ్రామిక వేత్తలను బెదిరించి హోటళ్లను తీసుకున్నారని, బాధితులైన వారే తనకు స్వయంగా చెప్పారని అన్నారు.
పదేళ్లపాటు అధికారంలో ఉండి, వేల కోట్ల రూపాయల ఆస్తులు దోచుకున్న కేసీఆర్, కేటీఆర్ లను తెలంగాణ ప్రజలు తరిమే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.
