రూ.20 లక్షల ఆరోగ్య బీమా కల్పించండి

రూ.20 లక్షల ఆరోగ్య బీమా కల్పించండి

హైదరాబాద్, వెలుగు :  దినపత్రిక రంగంలో పనిచేస్తున్న డిస్ర్టిబ్యూటర్లకు ,పేపర్​ బాయ్స్​కు రూ.20 లక్షల ఆరోగ్య బీమాతోపాటు రూ.50 లక్షల ప్రమాద బీమా కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రింట్ మీడియా డిస్ర్టిబ్యూటర్స్​అసోసియేషన్ కోరింది.  80 శాతం సబ్సిడీతో ఈ చార్జింగ్​బైకులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది. మంగళవారం అసోసియేషన్​ మొదటి మహాసభ హైదరాబాద్​లో జరిగింది. 

ఈ సందర్భంగా 2024 డైరీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా  రాష్ట్ర అధ్యక్షుడు వనమాల సత్యం, ప్రధాన కార్యదర్శి కూడలి రామ్​ప్రసాద్​రావు మాట్లాడుతూ..రాష్ట్రంలో దాదాపు 30 లక్షల సర్కిలేషన్ ఉన్న దినపత్రికలను తెల్లవారకముందే గడప గడపకు చేరవేస్తున్నామని తెలిపారు. ఎండా, వాన, చలిని లెక్కచేయకుండా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ  పేపర్ వేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.  పత్రికల లోడింగ్​పంపిణీ కోసం షెడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. కార్మిక శాఖ నుంచి గుర్తింపు కార్డులు మంజూరు చేసి ఆసరా పథకం ద్వారా పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.