చిన్నారుల కుటుంబాలకు రూ. 8 లక్షల పరిహారం

చిన్నారుల కుటుంబాలకు రూ. 8 లక్షల పరిహారం

హైదరాబాద్: KBHP కాలనీలో సెల్లార్ గుంతలో పడి మృతి చెందిన  చిన్నారుల కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల రూపాయలు పరిహారం అందించింది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కృష్ణారావు బాధిత కుటుంబాలకు చెక్కులను అందజేశారు. ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షలు రూపాయలు పరిహారం అందించగా.. దీనితో పాటు ఎమ్మెల్యే కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ రావు మరో 3 లక్షల రూపాయలను బాధిత కుటుంబాలకు అందించారు. మొత్తం ఒక్కో బాధిత కుటుంబానికి 8 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే అందించారు.