
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాల యాల్లో పనిచేస్తున్న టీచర్లకు మిని మమ్ టైమ్ స్కేల్ వర్తింపజేయాలని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్ రెడ్డి, కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, కేజీబీవీ టీచర్లతో కలిసి వారు విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డిని కలిశారు.
కేజీబీవీ టీచర్లకు టైమ్ స్కేల్ అందించాలని విజ్ఞప్తి చేశారు.దీంతో కేజీబీవీ ఎస్ఓలకు మోడల్ స్కూల్ హాస్టల్ అడిషనల్ బాధ్యత లను తప్పిస్తామని, ప్రత్యేకంగా కేర్ టేకర్లకు నియమిస్తామని సబితారెడ్డి హామీ ఇచ్చారు. స్పెషల్ ఆఫీసర్ల పేరును ప్రిన్సిపల్స్ గా మారుస్తామని స్పష్టం చేశారు.