ప్రధాని మోడీని కలిసిన పీటీ ఉష

ప్రధాని మోడీని కలిసిన పీటీ ఉష

భారత ఒలింపిక్ సంఘం ( ఐఓఏ ) అధ్యక్షురాలుగా కొత్తగా ఎన్నికైన పీటీ ఉష ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని మర్యాదపూర్వకంగా కలిశారు. మోడీని కలిసిన విషయాన్ని ఆమె తన ట్విట్టర్ లో వెల్లడించారు. మోడీ నాయకత్వం నుండి ప్రజలు చాలా నేర్చుకోవచ్చునని తన ట్వీట్ లో పేర్కొన్నారు. "గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీజీని ఈరోజు ఆయన కార్యాలయంలో కలవడం, సంభాషించడం చాలా ఆనందంగా ఉంది. ఆయన నాయకత్వం, దేశానికి చేసిన సేవ నుండి చాలా నేర్చుకోవాలి" అని ఆమె ట్వీట్ చేశారు. 

58 ఏళ్ల పీటీ ఉష ఇటీవలే  ఒలింపిక్ అసోసియేషన్‌‌ (ఐవోఏ) ప్రెసిడెంట్‌‌గా ఏకగ్రీవంగా ఎన్నికైంది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రీడాకారిణిగా ఆమె రికార్డు సృష్టించింది. ప్రస్తుతం అథ్లెటిక్స్‌‌ ఫెడరేషన్‌‌ ఆఫ్‌‌ ఇండియా జూనియర్‌‌ సెలెక్షన్‌‌ కమిటీ చైర్‌‌ పర్సన్‌‌గా ఉన్న ఉష.. కొన్నేళ్లుగా గవర్నమెంట్‌‌ ఏర్పాటు చేసిన వివిధ జాతీయ అవార్డుల కమిటీలో పని చేశారు. కానీ ప్రెసిడెంట్‌‌గా ఎన్నికవ్వడం మాత్రం ఇదే తొలిసారి. సుప్రీంకోర్టు జడ్జి లావు నాగేశ్వర రావు పర్యవేక్షణలో జరిగిన ఎన్నికల్లో ఉషకు ఆపోజిట్‌‌గా ఎవరూ బరిలోకి దిగలేదు.