పబ్జీ గేమ్ తీసుకొచ్చిన క్రాఫ్టన్ కంపెనీ తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. దక్షిణ కొరియాలో జననాల సంఖ్య తగ్గడంపై ఆందోళన వ్యక్తమవుతున్న సమయంలో కీలక ప్రకటన చేసింది. దక్షిణ కొరియాలో జనాభాను పెంచేందుకు తమ వంతు ప్రయత్నంతో ముందుకొచ్చింది.
తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు పిల్లలను కంటే బిడ్డకు 64 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని చైల్డ్ కేర్ సపోర్ట్ విధానాన్ని ప్రకటించింది. అంతేకాకుండా పిల్లలను కనే ఉద్యోగులకు పెయిడ్ లీవ్స్తో పాటు మరెన్నో ప్రోత్సాహకాలు కూడా ప్రకటించింది.
ఒక్క బిడ్డను కనండి.. 64 లక్షల రూపాయలు తీసుకోండి.. మూడో బిడ్డకు 30 వేలు.. నాలుగో బిడ్డకు 40 వేలు కాదు.. ఒక్క బిడ్డను కంటేనే 64 లక్షల రూపాయలు ఇస్తామని ఆ కంపెనీ ప్రకటించింది. ఏదో ఆషామాషీగా.. కామెడీగా చెప్పలేదు. సీరియస్గా చెప్పింది.. చెప్పినట్లు బిడ్డను కన్న ఫ్యామిలీకి 64 లక్షల రూపాయలు ఇచ్చింది.
ఏంటి బాసూ మరీ టూమచ్గా చెబుతున్నావ్ అంటారా.. టూమచ్.. త్రీ మచ్ ఏమీ లేదు.. దక్షిణ కొరియా దేశంలోని ఓ ప్రైవేట్ కంపెనీ అమలు చేసి చూపించింది. ఇంతకీ ఆ కంపెనీ ఏదీ అంటారా.. పబ్ జీ.. PubG గేమ్ సృష్టికర్త క్రాఫ్టన్.. ఇప్పటికే 46 మందికి.. ఒక్కొక్కరికీ 64 లక్షల రూపాయలు చెల్లించింది కూడానూ.. ఆ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
దక్షిణ కొరియా దేశం. ఈ భూమండలంపైనే అతి తక్కువ జననాల రేటు ఉన్న దేశం. దక్షిణ కొరియా మొత్తం జనాభా సుమారుగా 0.1 శాతమే పెరిగింది. జనాభా సుమారు 5 కోట్లు దాటింది. జనాభా పెరుగుదల శాతం అత్యల్పం. ఈ పెరుగుతున్న జనాభాకు కారణం కూడా దక్షిణ కొరియాకు వెళ్లి స్థిరపడిన విదేశీయులే కావడం గమనార్హం. సౌత్ కొరియాలో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.. పిల్లలను కనటం లేదు.
పెళ్లి కాని వాళ్లు బాధపడటం లేదు. ఎందుకు అంటారా.. పిల్లలను పెంచటం చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. అక్కడ విద్య, వైద్యంతో పాటు ఆస్పత్రి ఖర్చు చాలా ఖరీదు. ఈ క్రమంలోనే దక్షిణ కొరియాలో పెళ్లి చేసుకున్నా పిల్లలను అస్సలు కనటం లేదు. ఈ క్రమంలోనే భూమండలంపైనే అతి తక్కువ జననాల రేటు ఆ దేశంలోనే నమోదు అవుతుంది.
ఇప్పటికే సౌత్ కొరియా దేశంలో పిల్లల్ని కనాలంటూ జంటలకు అనేక ప్రోత్సహకాలు ఇస్తుంది. అయినా కొత్త జంటలు పట్టించుకోవటం లేదు. పిల్లలను ఎందుకు కనటం లేదు అనే విషయాన్ని గుర్తించిన పబ్ జీ గేమ్ సృష్టికర్త కంపెనీ క్రాఫ్టన్ ఓ ఐడియా వేసింది. కంపెనీలో పని చేసే వాళ్లు.. ఒక్క బిడ్డను కంటే చాలు 64 లక్షల రూపాయలు ఇస్తాం అని 2025 ఫిబ్రవరి నెలలో ప్రకటించింది.
ఉద్యోగులు ఆశలు చిగురించాయి. 64 లక్షల రూపాయలు అంటే మాటలు కాదు కదా.. పిల్లలకు ప్లానింగ్ చేసింది. 2026, జనవరి నుంచి ఏప్రిల్ నెలల మధ్య.. 46 మంది శిశువులకు జన్మనిచ్చారు కంపెనీ ఉద్యోగులు. వాళ్లకు 64 లక్షల రూపాయలు ఇవ్వటమే కాకుండా.. 2 నెలలు జీతంతో కూడిన సెలవులు ప్రకటించింది. ఆ 2 నెలల తర్వాత అవసరాన్ని బట్టి వర్క్ ఫ్రం హోం ఇవ్వటం అనే ఆప్షన్స్ ఇచ్చింది కంపెనీ.
