థర్డ్‌‌‌‌‌‌‌‌ వేవ్‌‌‌‌‌‌‌‌పై వార్తలు ఉత్తవే

థర్డ్‌‌‌‌‌‌‌‌ వేవ్‌‌‌‌‌‌‌‌పై  వార్తలు ఉత్తవే

హైదరాబాద్, వెలుగు: కరోనా థర్డ్ వేవ్‌‌‌‌‌‌‌‌పై వస్తున్న సర్వేల్లో శాస్ర్తీయత ఉండడం లేదని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు. ‘సెప్టెంబర్ లేదా అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో థర్డ్ వేవ్.. లక్షల్లో కేసులు’ వస్తాయంటూ వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. దేశంలో, రాష్ట్రంలో మరో బలమైన కొత్త వేరియంట్‌‌‌‌‌‌‌‌ పుట్టుకొస్తే తప్ప, థర్డ్ వేవ్ రాదన్నారు. ఈ మేరకు మంగళవారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. థర్డ్ వేవ్‌‌‌‌‌‌‌‌ సూచనలేవీ రాష్ట్రంలో కనిపించడం లేదన్నారు. జనాలు గుంపులుగా తిరగడం వల్ల అక్కడక్కడా ఒక్రటెండు రోజులు ఎక్కువ కేసులు నమోదవుతున్నాయన్నారు. అవి అంతవరకే తప్ప వేవ్ అయ్యే అవకాశం లేదన్నారు. కరోనా వేవ్‌‌‌‌‌‌‌‌లపై వస్తున్న చాలా సర్వేలు నంబర్ల గేమ్‌‌‌‌‌‌‌‌లా ఉంటున్నాయని, ఫీల్డ్‌‌‌‌‌‌‌‌ లెవల్‌‌‌‌‌‌‌‌ సమాచారం లేకుండానే రిపోర్టులు ఇస్తున్నారని ఆయన చెప్పారు. తమ అంచనా ప్రకారం కొత్త వేరియంట్ వస్తే తప్ప ఇప్పట్లో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం లేదన్నారు. 

రెండు డోసులేసుకున్నా మాస్క్​ తప్పనిసరి

చిన్న పిల్లలపై థర్డ్ వేవ్ ఎఫెక్ట్ ఉంటుందన్న దాంట్లోనూ ఏమాత్రం శాస్ర్తీయత లేదన్నారు. ప్రజలు అనవసరంగా ఆందోళన చెందొద్దని విజ్ఞప్తి చేశారు. అయితే, కరోనా ముప్పు పూర్తిగా తొలగిపోలేదన్న విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవాళ్లు కూడా మాస్కు కంపల్సరీగా పెట్టుకోవాలని సూచించారు. ఎన్ని వేవ్‌‌‌‌‌‌‌‌లు వచ్చినా ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నామని చెప్పారు. సుమారు రూ.456 కోట్లతో ప్రభుత్వ దవాఖాన్లను బలోపేతం చేస్తున్నామని చెప్పారు.అయితే, సెప్టెంబర్ లేదా అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో థర్డ్ వేవ్ వస్తుందని, రోజూ 5 లక్షల వరకూ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని నీతి ఆయోగ్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ నిపుణుల బృందాలు కేంద్ర ప్రభుత్వానికి రెండ్రోజుల కింద రిపోర్ట్ ఇచ్చాయి.