2026లో 27 సెలవులు.. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన హాలీడేస్‌ లిస్ట్ ఇదే..

2026లో 27 సెలవులు.. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన హాలీడేస్‌ లిస్ట్ ఇదే..

హైదరాబాద్, వెలుగు: 2026 సంవత్సరానికి సంబంధించి జనరల్, ఆప్షనల్​హాలీడేస్‌పై ప్రభుత్వం జీవో జారీ చేసింది. వచ్చే ఏడాది మొత్తం 27 రోజులను సాధారణ సెలవులుగా ప్రకటించారు. ఇందులో సంక్రాంతి, ఉగాది, రంజాన్, దసరా, దీపావళి, క్రిస్మస్ వంటి ముఖ్యమైన పండుగలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ అన్ని ఆదివారాలు, ప్రతి నెల రెండో శనివారం మూసి ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

రంజాన్, బక్రీద్ వంటి పండుగల తేదీల్లో చంద్రదర్శనం ఆధారంగా ఏవైనా మార్పులు ఉంటే, వాటిని మీడియా ద్వారా ముందుగానే తెలియజేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సాధారణ సెలవులతో పాటు 26 ఆప్షనల్​సెలవుల జాబితాను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో జనవరి 1న న్యూ ఇయర్, కనుమ, వరలక్ష్మీ వ్రతం తదితర పండుగలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ జాబితా నుంచి తమ ఇష్టానుసారం, ముందస్తు అనుమతితో ఏడాదిలో గరిష్టంగా 5 ఐచ్ఛిక సెలవులను వినియోగించుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.