
హైదరాబాద్, వెలుగు: ప్రజాప్రతినిధులు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ గురుకుల పాఠశాలలను సందర్శించి అక్కడి సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్సూచించారు. ఆర్సీవోలు కూడా స్కూల్స్ ను విజిట్ చేసి రిపోర్టులు వెంటనే సెక్రటరీ సైదులుకు అందించాలన్నారు.
బుధవారం బీసీ గురుకులాలపై మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎక్కడెక్కడ సొంత భవనాలు లేవో అక్కడ భూమి కేటాయించేలా కలెక్టర్లు చొరవ తీసుకోవాలన్నారు. గన్నేరువరం స్కూల్ ను తిమ్మాపూర్ నుంచి గన్నేరువరానికి షిఫ్ట్ చేయాలని ఆదేశించారు.