సిటీ బస్సుల కోసం పబ్లిక్ ఎదురుచూపులు

సిటీ బస్సుల కోసం పబ్లిక్ ఎదురుచూపులు

సిటీ బస్సులు స్టార్టయ్యాకే!

ఆర్టీసీ సర్వీసులు నడిపే తీరుపై దృష్టి
ఫిజికల్ డిస్టెన్సింగ్, శానిటేషన్ కు  జాగ్రత్తలు
స్టేషన్లలో టెంపరేచర్ చెకింగ్.. మాస్కులు మస్ట్‌‌

నష్టమైనా నడుపుడే అంటున్న మెట్రో ఎండీ
సెంట్రల్ పర్మిషన్‌‌ ఇచ్చే వరకు వెయిటింగ్

హైదరాబాద్‌‌, వెలుగు: సిటీలో లాక్‌‌డౌన్‌‌ రిలాక్సేషన్లు ఇచ్చిన తర్వాత అందరిలోనూ మెట్రో రైళ్లు ఎప్పుడు స్టార్టవుతాయనే ఆసక్తి ఏర్పడింది. గవర్నమెంట్, ప్రైవేట్​ఆఫీసులు పూర్తిగా తెరుచుకున్నాయి. ఆర్టీసీ, మెట్రో సర్వీసులు లేకపోవడంతో ఎంప్లాయీస్ ఓన్ వెహికల్ వాడుతున్నారు. లేనివారు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. క్యాబ్, ఆటోలు కొన్ని కండీషన్ల మీద నడుస్తున్నా, వాటి చార్జీలు కామన్ మ్యాన్ కి భారంగా ఉన్నాయి. దాంతో సిటీ బస్సులు, మెట్రో ట్రైన్స్ ఎప్పుడు మొదలవుతాయంటూ ఎంక్వైరీ చేస్తున్నారు. లాక్‌‌డౌన్‌‌ను ఎత్తేస్తే సిటీలో బస్సులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ ఆఫీసర్లు చెప్తున్నారు. మెట్రో విషయంలోనే  సందేహాలున్నాయి.

57 ట్రైన్స్.. 4  లక్షల మంది జర్నీ

లాక్ డౌన్ కి ముందు సిటీలో 57 మెట్రో ట్రైన్స్ లో డైలీ 4 లక్షల దాకా మంది జర్నీ చేసేవారు.  నాగోల్‌‌–హైటెక్‌‌ సిటీ రూట్‌‌లో రద్దీ ఎక్కువ. ప్రస్తుతం ఆఫీసులన్నీ నార్మల్‌‌గా నడుపుకోవచ్చునని ప్రభుత్వం పర్మీషన్‌‌ ఇచ్చినా ఐటీ కంపెనీలు మాత్రం వర్క్‌‌ ఫ్రమ్‌‌ హోమ్‌‌నే ప్రిఫర్‌‌ చేస్తున్నాయి. దాంతో కొద్దిరోజులపాటు ఈ రూట్‌‌లో రష్‌‌ తక్కువగానే ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. 3 కోచ్​ల సిటీ మెట్రో రైల్​లో నార్మల్​ డేస్​లో దాదాపు వెయ్యి మంది వరకు జర్నీ చేస్తారు. సీటింగ్‌‌ కెపాసిటీ తక్కువ కావడం వల్ల ఎక్కువమంది నిలబడే వెళ్తుంటారు. బస్సుల్లో మాదిరిగా ఫిజికల్ డిస్టెన్స్ అమలు చేయాలంటే సీటుకు సీటుకు గ్యాప్‌‌ ఇవ్వాలి. నిలబడే వారి సంఖ్య తగ్గించాలి. ప్రతి ట్రిప్‌‌కి ట్రైన్‌‌ను శానిటైజ్‌‌ చేయాలి. స్టేషన్లను కూడా ఎప్పటికప్పుడు క్లీన్‌‌ గా ఉంచాలి.

సేఫ్టీ ప్రికాషన్స్..

కరోనా నేఫథ్యంలో మెట్రో స్టేషన్లలో సేఫ్టీ ప్రికాషన్స్ పాటించాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ముందుగా ఎక్కువమంది స్టేషన్ లోకి రాకుండా కంట్రోల్ చేసి.. ఎంట్రీలోనే టెంపరేచర్‌‌ చెకింగ్, శానిటైజర్ ఇవ్వడం, మాస్క్‌‌ చెకింగ్​ వంటివి చూడాల్సి ఉంటుందన్నారు. కొంతకాలం పాటు టికెటింగ్‌‌ సిస్టమ్ కాకుండా స్మార్ట్ కార్డులు వాడడం,  ప్రతి స్టేషన్‌‌కి ట్రైన్ ఆపితే క్రౌడ్‌‌ కంట్రోల్‌‌ కష్టమవుతుంది కాబట్టి స్టేషన్‌‌ విడిచి స్టేషన్‌‌, లేదా సెలక్టెడ్ ఏరియాల్లో ఆపడం, కొన్ని స్టేషన్లను కొన్నిరోజులు మూసేయడం వంటి అంశాలనూ పరిశీలిస్తామంటున్నారు. కేంద్రం డొమెస్టిక్‌‌ ఫ్లైట్లను నడుపుకొనే అవకాశం ఇచ్చినందున మెట్రోకు కూడా తొందర్లోనే పర్మిషన్‌‌ ఇస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు.

కంట్రోల్ చెయ్యడమెలా!

సిటీ బస్సుల్లో ప్యాసింజర్లకు కంట్రోల్ చేయడం కొంతవరకు ఈజీ. కానీ, మెట్రో ట్రైన్​లో క్రౌడ్‌‌ను ఎలా మెయింటెయిన్‌‌ చేయాలో తెలియని పరిస్థితి. తాము ట్రైన్లు నడిపేందుకైనా రెడీగా ఉన్నామని అధికారులు చెప్తున్నా.. ప్రాక్టికల్‌‌ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తున్నారు. సిటీలో దాదాపు 3 వేల బస్సులు తిరుగుతాయి. ఆఫీసు​లు, కాలేజ్ టైమింగ్స్‌‌లో ఫుల్ రష్ తో ఉంటాయి. మెట్రోలోనూ అదే పరిస్థితి. అందుకే సిటీ బస్సులు స్టార్‌‌ అయితే క్రౌడ్‌‌ను ఎలా కంట్రోల్‌‌ చేస్తారో చూసి.. తర్వాత మెట్రో ట్రైన్స్ రన్ చేస్తామని అధికారులు అంటున్నారు. బస్సులు తిరిగితేనే ప్యాసింజర్లు మెట్రో స్టేషన్లకు చేరుకోవడమూ ఈజీ అవుతుందని చెప్తున్నారు.

ఈ టైమ్‌‌లో ఛాలెంజింగే..

కేంద్రం అనుమతించిన వెంటనే మెట్రో రైళ్లు నడిపేందుకు సిద్ధంగా ఉన్నం. ఇప్పుడు టెక్నికల్‌‌ ఇష్యూస్‌‌ చెక్‌‌ చేసుకు నేందుకు రెండు ట్రైన్లు నడుపుతున్నం. సిగ్నలింగ్‌‌, ఎలక్ట్రికల్‌‌, ట్రాక్‌‌ చెకింగ్‌‌ లాం టివి చేస్తున్నం. లాక్‌‌డౌన్‌‌ కండీషన్లతో మెట్రో నడపడం అంత ఈజీ ఏమీ కాదు. అలా అని నడపలేమని కాదు. ఇట్స్‌‌ ఛా లెంజింగ్‌‌. మేం దానికి రెడీగా ఉన్నాం. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ట్రైన్లు నడుపుతం.’’

‑ ఎన్వీఎస్ రెడ్డి, మెట్రో ఎండీ

For More News..

తెలంగాణలో కొబ్బరి పీచుతో రోడ్లు

ఓపెనింగ్‌కు సిద్ధంగా కేబుల్ బ్రిడ్జి

సిమ్ బ్లాక్ అయితదంటూ స్కూల్ టీచర్ కు ఫోన్ చేసి..