కరోనా సేవలో పూజ సైతం

కరోనా సేవలో పూజ సైతం

ప్రజలు తమను ప్రేమించకపోతే ఇంత పెద్ద స్టార్స్ అయ్యేవాళ్లమే కాదు అంటుంటారు మన యాక్టర్స్. అయితే ఇప్పుడు వాళ్లు తిరిగి ప్రజలపై ప్రేమ చూపించాల్సిన సమయం వచ్చింది. కరోనా కోరల్లో చిక్కి దేశమంతా విలవిల్లాడుతోంది. ఎంతోమంది సంపాదన లేక, కడుపు నిండా తినలేక కష్టపడుతున్నారు. వాళ్లని మన స్టార్స్ రకరకాలుగా ఆదుకుంటున్నారు. పూజా హెగ్డే కూడా తన వంతు సాయం చేయడానికి ముందుకొచ్చింది. ఇటీవల వంద కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకుల్ని అందించింది. వాటిని స్వయంగా ప్యాక్‌‌ చేసి మరీ అందరికీ అందేలా చేసింది పూజ. పరిస్థితి నార్మల్‌‌గా అయ్యేవరకు హెల్ప్ చేస్తూనే ఉంటానంటోంది. ఆమధ్య పూజ కూడా కోవిడ్ బారిన పడింది. కాస్త కోలుకోగానే కోవిడ్‌‌ని ఎదుర్కోవడం ఎలాగో వీడియోల ద్వారా చెప్పి నెటిజన్స్‌‌లో అవేర్‌‌‌‌నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. బ్రీతింగ్‌‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆన్‌‌లైన్‌‌లోనే యోగా క్లాసులు కూడా చెప్పింది. ఇప్పుడిలా నేరుగా రంగంలోకి దిగి సాయమందిస్తోంది. మరోవైపు తన సినిమాల షూట్స్‌‌లో జాయినవడానికి కూడా రెడీగా ఉంది పూజ. బాలీవుడ్‌‌లో సల్మాన్‌‌తో ‘కభీ ఈద్ కభీ దివాలీ’, రణ్‌‌వీర్ సింగ్‌‌తో ‘సర్కస్’ చిత్రాలు చేస్తోంది. తమిళంలో విజయ్‌‌తో నటిస్తోంది. తెలుగులో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌‌లర్’ రిలీజ్‌‌కి రెడీగా ఉంది. ఆచార్య, రాధేశ్యామ్ చిత్రాలు పూర్తి చేయాల్సి ఉంది. ‘రాధేశ్యామ్‌‌’లో ఒకే ఒక్క పాటలో పూజ నటించాల్సి ఉందట. లాక్‌‌డౌన్ టైమ్‌‌లోనే అన్ని జాగ్రత్తలతో దాన్ని పూర్తి చేసేందుకు ప్లాన్‌‌ చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎంతవరకు నిజమో మరి.