Kriti Kharbanda Wedding: ప్రియుడిని పెళ్లి చేసుకున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్ కృతి ఖర్బందా

Kriti Kharbanda Wedding: ప్రియుడిని పెళ్లి చేసుకున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్ కృతి ఖర్బందా

బ్యూటీ కృతి ఖర్బందా (Kriti Kharbanda) తెలుగు, కన్నడ, హిందీ భాషా చిత్రాలలో తన నటనతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. మోడల్‌గా తన కెరీర్‌ను స్టార్ట్ చేసిన కృతి ఖర్బందా శుక్రవారం (మార్చి 15న) వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ప్ర‌ముఖ బాలీవుడ్ హీరో పులకిత్‌ సామ్రాట్‌తో కృతి ఏడడుగులు వేసింది.

వీరి వివాహ వేడుక హర్యానాలోని గురుగ్రామ్‌లో జ‌రుగ‌గా..ఈ పెళ్లికి ఇరు కుటుంబసభ్యులు, కొద్దిమంది స్నేహితులు హాజరయ్యారు. అయితే,  అయితే వీరి పెళ్లికి సంబంధించిన న్యూస్ ను ఒక‌రోజు ఆలస్యంగా రివీల్ చేశారు. 

కృతి తమ పెళ్లి ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ..'నా మొదలు నుండి తుది వరకు నువ్వే. నా గుండె భిన్నంగా కొట్టుకున్నప్పుడు నువ్వే అయి ఉండాలి. అది స్థిరంగా..నిరంతరం' అంటూ తనదైన శైలిలో కృతి ఖర్బందా పోస్ట్ చేసింది. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఫ్యాన్స్, సెలబ్రెటీస్ విషెస్ తెలుపుతున్నారు. 

కృతి ఖర్బందా తెలుగులో సుమంత్ హీరోగా వచ్చిన బోణి మూవీతో ఎంట్రీ ఇచ్చి..తీన్ మార్, అలా మొదలైంది, మిస్టర్ నూకయ్య, ఓం త్రీడీ, ఒంగోలు గిత్త, చివరగా 2015లో రామ్ చరణ్ బ్రూస్లీ సినిమాలో నటించింది.ఇక ఆ తర్వాత తెలుగులో పెద్దగా అవకాశం రాలేదు. దీంతో హిందీపై పూర్తి ఫోకస్ చేసింది.