
తెలంగాణ భూములకు అన్ని రకాల పంటలకు సానుకూలత ఉన్న నేపథ్యంలో తెలంగాణలో పప్పుదినుసుల సాగుకు కూడా ఊతం ఇవ్వాలి. ఎలాగయితే పామాయిల్ సాగుకు ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తున్నదో అదేవిధంగా పప్పుదినుసులకు కూడా అందించాలి. ఇది ఒక మిషన్ మోడ్లో సాగాలి.
తెలంగాణలో ఉండే 47 శాతం ఎర్ర భూములు ఇందుకు ఆలవాలంగా నిలుస్తాయి. కావున ఆ వైపుగా ప్రభుత్వం అలోచించాలి. పైలెట్ ప్రాజెక్టుగా మహబూబ్ నగర్ జిల్లాను ఎంచుకుంటే బాగుంటుంది. మహబూబ్ నగర్ లో ఒక పప్పుదినుసుల పరిశోధన కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ప్రోత్సహించడం అవసరం.
- భారత అవినాశ్, జనగామ-