బోరుబావిలో చిన్నారి : సేఫ్ గా బయటికి తీసిన NDRF టీమ్

బోరుబావిలో చిన్నారి : సేఫ్ గా బయటికి తీసిన NDRF టీమ్

పుణే: బోరుబావిలో పడిన ఆరేళ్ల చిన్నారి ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు ఎన్డీఆర్‌‌ఎఫ్‌‌ సిబ్బంది. 10 అడుగుల లోతులో చిక్కుకున్న బాలుడిని 16 గంటలు శ్రమించి రక్షించారు. పుణెలోని థోరందలే గ్రామానికి చెందిన బాలుడు రవి భిల్‌‌ (6) తల్లిదండ్రులు దినసరి కూలీలు. బుధవారం మాంచర్ తెహ్సిల్‌‌లో వాళ్లు రోడ్డు వేసే పని చేస్తుంటే రవి దగ్గర్లో ని పొలంలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. కాసేపటికి కొడుకు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించారు. బోరుబావిలో పడినట్లు తెలుసుకుని వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు.

ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు, ఎన్డీఆర్‌‌ఎఫ్‌‌ సిబ్బంది సహాయకచర్యలు మొదలెట్టారు. 200 అడుగుల లోతున్న బోరుబావిలో బాలుడు 10 అడుగుల లోతులో చిక్కుకున్నట్లు గుర్తించారు. బావికి సమాంతరంగా గొయ్యి తవ్వి బాలుడిని చేరుకున్నారు. వైద్యం కోసం చిన్నారిని ఆస్పత్రికి తరలించారు.