పూణె కారు ప్రమాదం: రాజకీయ దుమారం ..రియల్టర్‌తో సహా ఐదుగురు అరెస్టు

పూణె కారు ప్రమాదం: రాజకీయ దుమారం ..రియల్టర్‌తో సహా ఐదుగురు అరెస్టు

పుణె కారు ప్రమాద ఘటనలో నిందితుడి తండ్రి అయిన రియల్ఎస్టేట్ డెవలపర్ ను మంగళవారం(మే 21) అరెస్ట్ చేశారు పోలీసులు.పుణెలోని కళ్యాణి నగర్ ప్రాంతలో 17 ఏళ్ళ మైనర్ బాలుడు లగ్జరీ కారును వేగంగా నడిపి ఇద్దరు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందిన విషయం తెలిసిందే.. ఈ ఘటన పుణేలో రాజకీయ దుమారం రేపింది.  అధికార నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే, పోలీసులు మైనర్ ను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని మహావికాస్ అఘా డి నేతలు నిరసనలు తెలపడంతో మైనర్ బాలుడి తండ్రి అయిన రియల్ ఎస్టేట్ డెవలపర్ తో మరో నలుగురిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. 

పుణెలోని కళ్యాణ్ నగర్  ప్రాంతంతో ఆదివారం తెల్లవారు జామున జరిగిన కారు ప్రమాదం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.. ఈ ప్రమాదంలో 17 ఏళ్ళ మైనర్ బాలు డు ఈ కారును ర్యాష్ గా డ్రైవ్ చేసి బైక్ ను ఢీకొట్టడంతో ఐటీ ఇంజనీర్లు అనీష్ అవధియా , అశ్విని కోష్ట  ప్రాణాలు కోల్పోయారు. ఇరుకైన సందులో లగ్జరీ కారును 200 కిలోమీటర్ల వేగంలో నడిపినట్లు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డయ్యింది. ఈ కేసులో బాలుడితోపాటు అతనికి మద్యం సరఫరా చేసిన రెండు బార్లను కూడా సీజ్ చేశారు పుణె పోలీసులు.. బారు యజమానులను కూడా అరెస్ట్ చేశారు. 

ప్రస్తుతం ఈ కేసును పుణె పోలీస్ క్రైం బ్రాంచికి బదిలీ చేశారు. బాలుడి తండ్రిపై జువైనల్ జస్టిస్ చట్టంలోని 75,77 సెక్షన్ల కింది కేసులు నమోదు చేశారు.