పడితే పైకే తల్లీ : రీల్స్ పిచ్చితో.. చావుతో గేమ్స్ ఆడుతున్న యూత్

పడితే పైకే తల్లీ : రీల్స్ పిచ్చితో.. చావుతో గేమ్స్ ఆడుతున్న యూత్

పైన ఫొటో చూశారా.. ఎంత దారుణం.. తలచుకుంటేనే వణుకు పడుతుంది.. సినిమాలో స్టంట్ కాదు.. ఇది రియల్.. రీల్ కోసం చేసిన రియల్ స్టంట్.. అవును.. దేశం మొత్తం షాక్ అయ్యింది ఈ వీడియో చూసి.. ఇంత డేంజర్ స్టంట్.. డేర్ గా ఎలా తీశారు.. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పిన.. ఏ మాత్రం అటూ ఇటూ అయినా ఈ పాటికి ఆ అమ్మాయి పైకి పోయేది అంటున్నారు నెటిజన్లు.. రీల్స్ పిచ్చికి ఇది పరాకాష్ఠ అంటూ తిట్టిపోస్తున్నారు నెటిజన్లు.. పూర్తి వివరాల్లోకి వెళితే..

మహారాష్ట్రలోని పూణె సిటీ శివార్లు. స్వామి నారాయణ్ ఆలయం సమీపంలో ఓ పురాతన భవనం ఉంది. ఆ భవనం పై అంతస్తుకు వెళ్లిన జంట.. రీల్ కోసం ఊహించని స్టంట్ చేసింది. అమ్మాయి బిల్డింగ్ పై నుంచి కింద పడుతున్న సమయంలో.. పైన ఉన్న అబ్బాయి.. ఆ అమ్మాయిని కాపాడుతున్నట్లు అన్న మాట.. అచ్చం సినిమాలో మాదిరిగా.. వీళ్లు ఒరిజినల్ క్రియేట్ చేశారు. అమ్మాయి బిల్డింగ్ పై నుంచి వేలాడుతుంటే.. అబ్బాయి చేయి పట్టుకుని కాపాడుతాడు.. ఈ రీల్ లో మరో విశేషం ఏంటో తెలుసా.. గాల్లో వేలాడుతూ కూడా ఆ అమ్మాయి హ్యాపీగా నవ్వుతూ.. కాళ్లు, చేతులు ఊపుతూ తన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించటం.. 

ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. ఈ రీల్స్ పిచ్చి ఈ దేవుడికే తెలియాలి అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే.. ఇలాంటి మూర్ఖపు ఆలోచనలు ఎలా వస్తాయంటూ మరికొందరు తిట్టి పొస్తున్నారు. నిన్నటికి నిన్న కారు రివర్స్ లో చేస్తూ రీల్ చేస్తున్న యువతి.. బ్రేక్ బదులు యాక్సిలేటర్ నొక్కి లోయలో పడి చనిపోయిన ఘటన వెలుగులోకి వచ్చిన 24 గంటల్లోనే.. అలాంటి తరహా రీల్ మరొకటి బయటకు రావటం సంచలనంగా మారింది.