శ్రీశైలం డ్యామ్ కు పూణే సైంటిస్టులు బృందం..ప్లంజ్ పుల్ లోతు పరిశీలన.. 

శ్రీశైలం డ్యామ్ కు పూణే సైంటిస్టులు బృందం..ప్లంజ్ పుల్ లోతు పరిశీలన.. 

నంద్యాల జిల్లాలోని శ్రీశైలం డ్యామ్ కు పుణెకు చెందిన సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ సైంటిస్టుల బృందం చేరుకున్నారు. మంగళవారం ( మే 20 ) డ్యామ్ కు చేరుకున్న సైంటిస్టులు బృందంతో డ్యామ్ అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్ష సమావేశం అనంతరం డ్యామ్ ప్లంజ్ పుల్ లోతును పరిశీలించారు సైంటిస్టులు బృందం.

ALSO READ | నీళ్లే లేనప్పుడు చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్ట్ ఎట్లా కడతాడు..?

ఏప్రిల్ లో కూడా శ్రీశైలం డ్యామ్ ను పరిశీలించారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) అధికారులు. చైర్మన్ అనిల్ జైన్ ఆధ్వర్యంలోని అధికారుల బృందం డ్యామ్ ను పరిశీలించారు. 2009లో భారీ వరదల కారణంగా డ్యామ్ ముందు భాగాన ఏర్పడిన భారీ గొయ్యిని, గ్యాలరీని, గేట్లను అప్రోచ్ రోడ్డును తనిఖీ చేశారు. ముందుగా డ్యామ్ వ్యూ పాయింట్ వద్ద సమావేశ భవనంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎన్డీఎస్ఏ టీమ్ కు డ్యామ్ అధికారులు వివరించారు. అనంతరం డ్యామ్ వద్దకు వెళ్లి క్రస్ట్ గేట్ల పనితీరు, స్టాప్ లాక్ ఎలిమెంట్స్, నీటి నిల్వను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

డ్యామ్ ముందు భాగాన వరద ఉధృతికి ఏర్పడిన(గొయ్యి) ప్లంజ్ పూల్ గురించి చీఫ్ ఇంజినీర్ కబీర్ బాష తెలియజేశారు. డ్యామ్ భద్రతకి ప్రమాదం ఉండడంతో చాలాసార్లు నిపుణుల టీమ్ పరిశీలించినప్పటికీ మరమ్మతుల్లో జాప్యం జరుగుతుంది. డ్యామ్ భద్రతపై నిర్లక్ష్యం వహించడం వంటి కారణాలతో ఎన్డీఎస్ఏ అథారిటీ చైర్మన్ టీమ్ పరిశీలనకు వచ్చింది.