తప్పు ఎవరిదైనా సరిదిద్దుకోకపోతే శిక్ష తప్పదు

తప్పు ఎవరిదైనా సరిదిద్దుకోకపోతే శిక్ష తప్పదు

రామగుండం ఎరువుల కర్మాగారం (RFCL) లో ఉద్యోగాల పేరిట మోసపోయిన బాధితుల కోసం అక్కడి ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఓ ప్రకటన చేశారు. బాధితులెవరైతే ఉన్నారో వారంతా ఈరోజు, రేపు 9గంటల నుండి 12గంటల లోపు క్యాంపు కార్యాలయానికి రండి అంటూ పిలుపునిచ్చారు. అక్కడి వస్తే మీ సమస్యలు పరిష్కరిస్తానని స్పష్టం చేశారు. ఎవరు ఎవరికి అన్యాయం చేసినా ఉపేక్షించబోనన్న ఎమ్మెల్యే..  తన అనుచరులైనా, పార్టీ కార్యకర్తలైనా తప్పు సరిదిద్దుకోకపోతే శిక్ష తప్పదని హెచ్చరించారు. 

రామగుండం ఎరువుల కర్మాగారంలో పర్మనెంట్ ఉద్యోగాల పేరిట నిరుద్యోగ యువత నుండి లక్షలు కాజేసిన వ్యవహారంపై బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిరసనలు, ర్యాలీలు చేపడుతున్నారు. తమకు ఉద్యోగం కల్పించాలని, డబ్బులు వెనక్కి ఇప్పించాలని బాధితులు గత నెల రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ ఈ ఘటనలో తాజాగా హరీష్ అనే బాధితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదిలా ఉండగా ఈవిధంగా మోసపోయిన వారిలో దాదాపు 400మంది ఉద్యోగులు ఉన్నట్టు సమాచారం.