బాలిక సూసైడ్ కేసులో... టీడీపీ నేత వినోద్​ కుమార్​ జైన్​ కు శిక్ష

బాలిక సూసైడ్ కేసులో... టీడీపీ నేత వినోద్​ కుమార్​ జైన్​ కు శిక్ష

నేరం చేస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదని మరోసారి రుజువైంది.  టీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్న వినోద్​కుమార్​ జైన్​ కు పోక్సో కోర్టు శిక్ష విధించింది.  2022 లో జరిగిన బాలిక ఆత్మ హత్య కేసులో దోషిగా నిర్దారించిన పోక్సో కోర్టు మూడు లక్షల రూపాయిల జరిమానాతో పాటు సెక్షన్​ 305 కింద జీవితకా జైలు శిక్షను విధిస్తూ తీర్పు ఇచ్చింది.  పోక్సో చట్టంలోని 9,10 సెక్షన్ల కింద ఏడేళ్లు కఠినకారాగార శిక్ష విధించింది. కోర్టు విధించిన 3 లక్షల జరిమానాను బాధితుల కుటుంబానికి చెల్లించాలని ఆదేశించింది.  ఈ కేసులో బాధితుల తరపున గుజ్జుల నాగిరెడ్డి వాదనలు వినిపించారు.

టీడీపీ నేత వినోద్​ కుమార్​కు జీవిత శిక్ష

బాలిక ఆత్మహత్య కేసులో టీడీపీ నేత వినోద్‌కుమార్‌ జైన్‌కు జీవిత కాల శిక్ష, రూ.3 లక్షల జరిమానా పోక్సో కోర్టు విధించింది. సెక్షన్‌ 305 కింద జీవితకాల జైలుశిక్షను విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. పోక్సో యాక్ట్‌ 9,10 సెక్షన్ల కింద ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. బాలికను లైంగికంగా వేధించిన  వినోద్‌జైన్‌.. ఆమె ఆత్మహత్యకు కారకుడయ్యాడు. రూ. 3 లక్షల జరిమానా విధించిన న్యాయస్థానం.. బాధిత కుటుంబానికి చెల్లించాలని ఆదేశించింది. ఈ కేసులో బాధితుల తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుజ్జుల నాగిరెడ్డి వాదనలు వినిపించారు. లోటస్ లెజెండ్ అపార్ట్‌మెంట్‌లో తొమ్మిదో తరగతి  బాలికను వినోద్ జైన్ వేధింపులకు గురి చేశాడు. అత్యంత దారుణంగా లైంగికంగా వేధించాడని అప్పట్లో బాలిక సూసైడ్​ నోట్​లో తాను అనుభవించినఅకృత్యాలను రెండు పేజీల్లో  పేర్కొంది.  బాలిక మరణంతో బాధిత కుటుంబ సభ్యులు నేటికీ కోలుకోలేకపోతున్నారని  పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుజ్జుల నాగిరెడ్డి  పేర్కొన్నారు.దోషిగా పేర్కొన్న వినోద్​ జైన్​ 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ తరపున కార్పొరేటర్​ గా పోటీచేసి ఓడిపోయారు.  సమాజంలో పెద్ద మనిషిగా చలామణి అవుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటంతో .. పోలీసులు  ఈ కేసును సీరియస్​గా తీసుకొని ..సైన్టిఫిక్ ఎవిడెన్స్ ఆధారాలు సేకరించడంతో నిందితుడికి శిక్ష పడిందని నాగిరెడ్డి తెలిపారు.

2021లో విజయవాడలో బాలిక సూసైడ్ సంచలనమైంది. విద్యాధరపురం కుమ్మరిపాలెం సెంటర్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న బాలిక ఓ రాత్రి ఆత్మహత్య చేసుకుంది. అపార్ట్ మెంట్ పై నుంచి దూకి బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికంగా ఉన్న ఒక పాఠశాలలో బాలిక 9వ తరగతి చదువుతుంది. టీడీపీ నేత వినోద్‌ జైన్‌ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని బాలిక సూసైడ్​ నోట్​లో రాసింది. ఈ విషయాన్ని అప్పటి ఏసీపీ హనుమంతరావు మీడియాకు తెలిపారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో వినోద్ జైన్ పై కేసు నమోదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం, ఐపీసీ 306 సెక్షన్​ల ప్రకారం కేసులను పెట్టామని అప్పటి ఏసీపీ హనుమంతరావు స్పష్టం చేశారు. వినోద్ జైన్ లైంగిక వేధింపుల కారణంగానే బాలిక చనిపోయినట్లు అధికారులు నిర్ధారించారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

2 నెలలుగా లైంగిక వేధింపులు 

బాలిక పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మరిన్ని సెక్షన్​ల కింద కేసులు నమోదు చేశారు. విచారణ కోసం  వినోద్​ జైన్​ ఇంటిని సీజ్​ చేశారు.  2 నెలలు వినోద్​జైన్ బాలికను లైంగికంగా వేధించాడని పోలీసులు గుర్తించారు. దీంతో తన బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక మానసిక క్షోభతో బాలిక ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు అంటున్నారు. ఈ విషయాలు బాలిక సూసైడ్ నోట్ లో రాసిందని ఏసీపీ తెలిపారు.  అపార్ట్ మెంట్ లిఫ్ట్​లో వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు బాలికను వినోద్ జైన్ వేధించేవాడని సూసైడ్​ నోట్​లో రాసింది.