
పంజాబ్ లో హైడ్రామా నెలకొంది. రేప్ కేసులో నిందితుడు అయిన ఆప్ ఎమ్మె్ల్యే పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. ఎస్కార్టింగ్ అధికారులపై కాల్పులు జరిపి పోలీసులనుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా పంజాబ్ ఉలిక్కిపడింది.
మంగళవారం (సెప్టెంబర్2) అత్యాచారం ఆరోపణలపై అరెస్టయిన పంజాబ్ ఆప్ ఎమ్మెల్యే హర్మీత్ పఠాన్‌మజ్రా పోలీసు కస్టడీనుంచి తప్పించుకున్నాడు. ఎస్కార్టింగ్ అధికారులపై కాల్పులు జరిపి పరారీ అయ్యాడు. స్కార్పియో, ఫార్చ్యూనర్ రెండు వాహనాల్లో ఎమ్మెల్యే, అతని సహాయకులు పారిపోయినట్ల పోలీసులు తెలిపారు.
సనౌర్‌కు చెందిన ఆప్ ఎమ్మెల్యే హర్మీత్ పఠాన్‌మజ్రాను మంగళవారం ఉదయం కర్నాల్‌లో అరెస్టు చేశారు. అతన్ని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తుండగా పఠాన్‌మజ్రా,అతని సహాయకులు పోలీసు బృందంపై కాల్పులు జరిపారు. ఒక పోలీసు వారిని ఆపడానికి ప్రయత్నించగా అతడిని ఢీకొట్టి రెండు SUV లలో పారిపోయారు. తరువాత పోలీసులు ఫార్చ్యూనర్‌ను అడ్డుకోగలిగారు..కానీ ఎమ్మెల్యే మరో వాహనంలో ఉన్నాడు.పరారీలో ఉన్న హర్మీత్ పఠాన్ మజ్రా కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
పఠాన్‌మజ్రాపై అత్యాచారం, మోసం ,క్రిమినల్ బెదిరింపు ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే విడాకులు తీసుకున్నారని అబద్ధం చెప్పి తనతో సంబంధం ప్రారంభించాడని ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో పఠాన్ మజ్జాపై కేసు నమోదు అయింది. లైంగిక దోపిడీ, బెదిరింపులు ,అశ్లీల సంబంధ కంటెంట్ పంపడం వంటి ఆరోపణలు అతనిపై ఉన్నాయి.